గురువారం, 30 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (17:03 IST)

పవన్ "భీమ్లా నాయక్" నుంచి మరో అప్డేట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి 'అంతాఇష్టం' అనే పాటను ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 
 
అలాగే, తాజాగా పవన్‌తో నిత్యామీనన్ కూర్చుని ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. సినిమాలో పవన్‌కు భార్యగా నిత్యమీనన్ నటిస్తున్నారు. దాంతో చిత్రం నుండి మొదటి సారి పవన్ నిత్యామీనన్‌ల పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
 
ఇక పోస్టరులో పవన్ ఓ రాయిపై కూర్చుని ఉండగా నిత్యా మీనన్ పక్కన గద్దె‌పై కూర్చుని ఉంది. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే అంతా ఇష్టం అనే పాట రొమాంటిక్ నేపథ్యంలో ఉండబోతున్నట్టు కనిపిస్తోంది.
 
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు రానా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇది మలయాళ చిత్రానికి రీమేక్.