సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (13:18 IST)

తెలుగు రాష్ట్రాల్లో అవతార్ కలెక్షన్ల వర్షం

avatar
తెలుగు రాష్ట్రాల్లో "అవతార్" కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ నెల 16వ తేదీన 2డీ, 3డీ ఫార్మెట్లలో ఈ చిత్రం విడుదలైంది. తొలి రోజునే ఏకంగా పది కోట్ల రూపాయల మేరకు కలెక్షన్లు రాబట్టింది. మూడు రోజుల్లో ఏకంగా రూ.38 కోట్ల మేరకు సినిమా వసూళ్లను రాబట్టింది. 5వ రోజుతో రూ.47 కోట్లు వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సంక్రాంతి వరకు పోటీగా నిలిచే చిత్రం ఏదీ లేదు. అందువల్ల అప్పటివరకు ఈ చిత్రం నిలకడగా వసూళ్లు రాబట్టే అవకాశాలు లేకపోలేదు.  
 
నిజానికి "అవతార్-2"లో కనిపించే కథ 25 శాతమే. ఈ స్టోరీని చెప్పేందుకు 75 శాతం టెక్నాలజీని దర్శకుడు ఉపయోగించాడు. దీనికే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కథ సంగతి ఎలా ఉన్నప్పటికీ అద్భుతమైన గ్రాఫిక్స్, ఆశ్చర్యపరిచే, అబ్బురపరిచే దృశ్యాలను చూడటానికి జనాలు థియేటర్లకు క్యూకడుతున్నారు. ఫలితంగా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది.