శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (18:54 IST)

ప్రశాంత్ గట్టి హగ్ ఇస్తా.. శ్రీముఖి

Sreemukhi
బిగ్ బాస్ 7 సీజన్ చివరి దశలో ఉంది. డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలేకి రెడీ అవుతున్న సమయంలో యాంకర్ శ్రీముఖి హౌస్‌లోకి వెళ్లింది. ప్రశాంత్‌కి హగ్ ఇస్తానంది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
బిగ్ బాస్ 7 సీజన్ పూర్తైన నెక్ట్స్ వీక్ "సూపర్ సింగర్" కార్యక్రమం ఉంటుందని హౌస్‌లో శ్రీముఖి అనౌన్స్ చేసింది. కంటెస్టెంట్స్‌కి సరదాగా సింగింగ్ ఆడిషన్ పెట్టింది.
 
ప్రశాంత్‌ని ఉద్దేశించి "ఇది ఫన్ టాస్క్.. ఓడిపోతే హగ్గిస్తా.. గెలిస్తే గట్టి హగ్గిస్తా.. ఓకే" అనడంతో ప్రశాంత్ నవ్వుతూ మెలికలు తిరిగిపోయాడు. శ్రీముఖి రాకతో బిగ్ బాస్ హౌస్ సందడిగా మారిపోయింది.