చిరంజీవి శత్రువా! - ఆ పేరు చెప్పడానికి క్కూడా ఇష్టపడనుః మోహన్‌బాబు సెన్సేషన్ కామెంట్
సినిమారంగం నీచ, నికృష్టంగా తయారైంది. ఎవరుపడితే వారు మాట్లాడేస్తున్నాడు. మా గురువుగారు దాసరి నారాయణరావుతోనే సినీ పెద్దరికం పోయింది. ఆ తర్వాత ఇంకెవరూ ఇండస్ట్రీకి పెద్ద లేరు. అంటూ డా. మంచు మోహన్‌బాబు తన మనసులోని మాటను వివరించారు. వారం రోజుల్లో `మా` ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు చర్చకు వచ్చాయి.
మీకు మిత్రులెవరు?
నాకు స్నేహితుడు, మనసువిప్పి మాట్లాడేవాడు రజనీకాంతే.
మరి చిరంజీవి స్నేహితుడు కాదా? ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో మీరే అన్నారుకదా?
స్నేహితులలో రకాలుంటాయి.
అంటే? ఎనిమినా? లేదంటే నటనలో సహచరుడా?
మీరు ఏమనుకున్నా సరే. అంటూ తనదైన శైలిలో మోహన్‌బాబు చెప్పాడు.
మరి చిరంజీవిగారే సినీపరిశ్రమలో అన్నీ సమస్యలకు పెద్దగా వున్నారే?
అని ఎవరు చెప్పారు. ఆయనే చెబితే అది ఆయనకే వదిలేస్తున్నా. దాసరి గారి తర్వాత ఎవ్వరూ పెద్దలు లేరు. వుండరు. వుండబోరు.
`మా` ఎన్నికల్లో మీ అబ్బాయి విష్ణు నిలబడుతున్నాడు. కృష్ణగారి ఆశీర్వాదం తీసుకున్నారుకదా? మరి చిరంజీవి దగ్గరకు వెళ్ళలేదా?
మా అబ్బాయి నిలబడుతున్నాడని మొదట్లోనే విష్ణుతో ఫోన్ చేయించాను. ఎందుకనో ఫోన్ కలవలేదు. తర్వాత ఇద్దరూ బిజీగా వుండడం వల్ల మళ్ళీ కుదరలేదు. నాకు విష్ణు ఎలాగో, రామ్‌చరన్; అల్లు అర్జున్ వారంతా నాకు బిడ్డలులాంటివారే.
మరి `మా` ఎన్నిక ఏకగ్రీవంగా వుంటే బాగుండేదని అందరూ అంటున్నారుగదా? అప్పుడైనా మాట్లాడితే పోయేదికదా?
అప్పట్లో ఫోన్ చేశా. కలవలేదు. చిరంజీవి కుటుంబం నుంచి కానీ అల్లు అరవింద్ కుటుంబం నుంచి ఎవరైనా పోటీచేస్తే విష్ణు తప్పుకునేవాడు. ఏకగ్రీవం అయ్యేది. ఇప్పుడు టైం లేదు. అవకాశం దాటిపోయింది.
ప్రకాష్‌రాజ్‌కు పోటీ వున్నాడు? మరి మీ వాడు గెలుస్తాడా?
మా వాడే గెలుస్తాడు. తప్పకుండా బల్లగుద్ది చెబుతున్నా. మా బిల్డింగ్ కూడా అవసరమైతే విష్ణు కడతాడు.
ప్రకాష్‌రాజ్ ఓడిపోతాడా?
అది నేను చెప్పను. అలాంటివారి పేరు ఉచ్చరించడాని కూడా నాకు మనస్కరించదు.
ఎందుకని. మీకు శత్రువా?
కాదు.
మరి ఎందుకు ఉచ్చరించరు?
తను ఎదురుబడితే అన్నగారు అంటారు. అంటూ తనదైన శైలిలో కొన్ని ప్రశ్నలను దాటవేస్తూ బదులిచ్చాడు మోహన్‌బాబు.