సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (17:11 IST)

రౌడీల భరతం పట్టే మొబైల్ యాప్ తో డాన్ 360 రాబోతుంది

Priya Hegde, Srikanth, Archana
Priya Hegde, Srikanth, Archana
ఒక మొబైల్ యాప్ తో రౌడీలను బుక్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తో డాన్ 360 అనే ఫుల్ యాక్షన్ ప్యాక్ మూవీ రూపొందింది. ట్రైలర్ ఇటీవలే విడుదలైంది.  ఈ సినిమాలో నటించిన శ్రీకాంత్ అయ్యంగర్, అర్చన అనంత్, సతీష్ సారిపల్లి కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈవెంట్ కి విచ్చేసి ఆశీర్వదించిన రామకృష్ణ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
 
Dawn 360 team with rk gowd
Dawn 360 team with rk gowd
ఈ సందర్భంగా దర్శకుడు, హీరో భరత్ కృష్ణ మాట్లాడుతూ : ఒక కొత్త కాన్సెప్ట్ తో నేను రాసుకున్న కథని నీ ముందు తీసుకొస్తున్నాను చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా తెలుగు ప్రేక్షకులు కొత్తదనం ఉంటే కచ్చితంగా ఆశీర్వదిస్తారు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. కథ చెప్పగానే నచ్చి మా ఈ సినిమాని ప్రోత్సహించి ఈ సినిమాలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్, అర్చన అనంత్, సారిపల్లి సతీష్ కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
 
హీరోయిన్ ప్రియా హెగ్డే మాట్లాడుతూ : డైరెక్టర్ కాదో చెప్పినప్పుడు ఎంతో ఎక్సైటింగ్ అనిపించింది. కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు రాబోతున్నాం మీరు సపోర్ట్ ఎప్పుడూ కావాలని కోరుకుంటున్నాము అన్నారు.
 
సతీష్ సారిపల్లి మాట్లాడుతూ : భరత్ కృష్ణ చెప్పిన కథ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. కొత్తగా డైరెక్షన్ చేస్తున్న కొత్త డైరెక్టర్ అన్నట్టు కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడి లాగా సినిమా తీశాడు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమాను ఆదరిస్తారు అలాగే ఈ సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
నటీనటులు : భరత్ కృష్ణ, ప్రియా హెగ్డే, శ్రీకాంత్ అయ్యంగార్, అర్చన అనంత్ మరియు సతీష్ సారిపల్లి
మ్యూజిక్ : రాజ్ కిరణ్,రచయిత మరియు దర్శకత్వం : భరత కృష్ణ, ప్రొడ్యూసర్ : ఉదయ రాజ్ వర్మ