ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (09:22 IST)

దిల్‌రాజు సినీపెత్తందారీ కోస‌మే ఇదంతా చేస్తున్నాడా!

Dilraju, Sankar
Dilraju, Sankar
ఈమ‌ధ్య నిర్మాత దిల్‌రాజు సినిమా రంగంలోని స‌మ‌స్య‌ల‌ను ఒక కొలిక్కి తెచ్చేందుకు త‌న భుజాల‌పై వేసుకున్నారు. అందులో భాగంగా ఏకంగా షూటింగ్‌లు అన్నీ బంద్ చేసి పెద్ద నిర్మాత‌ల‌తో ప్రొడ‌క్ష‌న్ వ్యయంపై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ప‌ది ప‌దిహేను రోజులు అనుకున్న‌ది ఏకంగా నెల‌పాటు జ‌రిగేట్లుగా క‌నిపిస్తోంది. తాజాగా బుధ‌వారంనాడుకూడా ఫిలింఛాంబ‌ర్‌లో 24 శాఖ‌ల‌కు చెందిన ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అందులో సినీకార్మికుల సంఘం లేదు.
 
ఇదిలా వుండ‌గా, షూటింగ్‌లు బంద్‌చేసి మీటింగ్‌లు జ‌రుపుకుంటున్న దిల్‌రాజు, నిన్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ను క‌లిశారు. ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అనంత‌రం తాను నిర్మిస్తున్న ఆర్‌.సి.15 సినిమా ప్రోగ్రెస్ గురించి చ‌ర్చించిన‌ట్లు ట్వీట్ చేశాడు. దీనిపై ఇప్ప‌టికే చ‌ర్చ జ‌రుగుతుంది. ఇంత‌కుముందు ఇదే విష‌య‌మై చ‌ర్చ జ‌రిగింది. అన్ని షూటింగ్‌లు బంద్ చేసి మీ సినిమా ఎందుకు చేస్తున్నారనేందుకు, ఆ సినిమాలో త‌మిళ హీరో త‌మిళ‌ద‌ర్శ‌కుడు అని క్లారిటీ ఇచ్చాడు. అయినా చిన్న నిర్మాత‌లు అందుకు ఏకీభ‌వించ‌లేదు. 
 
విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు, శుక్ర‌వారంనాడు జ‌ర‌గ‌బోయే ఛాంబ‌ర్ ఇ.సి. మీటింగ్‌, దిల్‌రాజు ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌బోయే నిర్మాత‌ల స‌మావేశం జ‌ర‌గ‌నుంది. అందులో ప‌లువురు తెలుగు, త‌మిళ సినిమా పేరుతో ఇలా మీరు షూటింగ్‌లు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌మ‌ని నిల‌దీయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే త‌న‌పై ర‌క‌ర‌కాలుగా వార్త‌లు మీడియా రాస్తుంద‌ని ఏదైనా వుంటే త‌న‌తో డైరెక్ట్‌గా మాట్లాడ‌వ‌చ్చ‌ని అన్న విష‌యం తెలిసిందే. అయితే అదే ఆయ‌న షూటింగ్‌లు బంద్ చేయ‌బోతున్నారంటూ మీడియా ముందుగానే అడిగితే, అస‌లు మీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఏదేదో రాస్తున్నారు. ఎందుకు బంద్ అవుతాయంటూ.. రుస‌రుస‌లాడాడు. ఆ త‌ర్వాత కొద్దిరోజుల‌కే ఆయ‌నే స్వ‌యంగా షూటింగ్‌లు బంద్ అంటూ ప్ర‌క‌టించాడు. దీనినిబ ట్టి దిల్‌రాజుకు ప‌బ్లిసిటీతోపాటు సినీ పెద్ద అవ్వాల‌నే ఆలోచ‌న వున్న‌ట్లు సినీవ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి.