రియా పరిచయం కాకముందే సుశాంత్‌కు డ్రగ్స్ అలవాటుంది..!!

sushant singh rajput
ఠాగూర్| Last Updated: గురువారం, 10 సెప్టెంబరు 2020 (09:11 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి మానసిక ఒత్తిడితోపాటు.. డ్రగ్స్ అలవాటు ఉండటం, తన ప్రియురాలు రియా చక్రవర్తి దూరం కావడం వంటి కారణాలు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ విషయాలన్నింటికంటే.. సుశాంత్‌కు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నట్టు మాదకద్రవ్య నిరోధక విభాగం అధికారులు తేల్చారు. రియా చక్రవర్తి వద్ద జరిపిన విచారణలో ఈ విషయం తేటతెల్లమైంది.

అయితే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఎలా డ్రగ్స్ సరఫరా అయ్యేవి? 'కేదార్ నాథ్ ' చిత్రం షూటింగ్ సమయంలో ఎవరి ద్వారా డ్రగ్స్ తీసుకున్నాడు? తాను ఎవరి ద్వారా డ్రగ్స్ తెప్పించి సుశాంత్‌కు ఇచ్చింది? తదితర విషయాలను అధికారుల విచారణలో రియా స్పష్టంగా చెప్పినట్టు వినికిడి. ఇదే విషయాన్ని తమ రిపోర్టులో ప్రస్తావించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేష్ జోషి ముందు నివేదికను ఉంచగా, రియా బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా, 2016-17లో 'కేదార్ నాథ్' సినిమా షూటింగ్ సమయంలో రియా ద్వారా సుశాంత్ మాదకద్రవ్యాలను తెప్పించుకున్నాడు. అతనికి రియాతో పరిచయం కాకముందే డ్రగ్స్ అలవాటు ఉంది. వైద్యులు వద్దని చెప్పినా అతను వాటిని వినియోగిస్తూనే ఉన్నాడు. వాటిని రియా ద్వారా తెప్పించుకున్నాడనడానికి సాక్ష్యాలున్నాయి. ఈ విషయంలో షోవిక్, శామ్యూల్ మిరిందాలను కూడా విచారించాం. వారి నుంచి కూడా కీలక ఆధారాలు లభించాయి. ఈ సమయంలో నిందితులకు బెయిల్ ఇస్తే, సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి" అని ఎన్సీబీ తరఫు న్యాయవాది మేజిస్ట్రేట్‌కు తెలిపారు.దీనిపై మరింత చదవండి :