కెమెరాలో లైగర్ లుక్‌కు ఫిదా అయిన అభిమానులు
విజయ్ దేవరకొండ తన సినిమా లైగర్ అప్‌డేట్స్ మూడు రోజులు వరసుగా వస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందులో భాగం బాలీవుడ్‌లో నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ బిటీఎస్ పిక్స్ ను విడుదల చేశారు. లైట్ బ్రౌన్ కలర్ హెయిర్‌తో అందమైన జుట్టుతో కెమెరాను చూస్తున్న విజయ్ దేవరకొండ లుక్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇంకో పిక్‌ను కూడా పెట్టి విజయ్ దర్శకుడు పూరీ జగన్నాధ్‌తో సన్నివేశాల గురించి చర్చిస్తున్నట్లు పోస్ట్ చేశాడు. ఇకక రేపు ఉదయం సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు.
నూతన ఏడాదికి రెండు ఒకరోజు ముందుగానే మరో అప్‌డేట్ రాబోతుంది. ఇన్‌స్ట్రాలో ఈరోజు సాయంత్రం 5గంటల లోపు మరో అప్‌డేట్ చేయనున్నట్లు విజయ్ టీమ్ తెలియజేసింది.
లైగర్ కథ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మైక్ టైసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. పూరీ, చార్మి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది.