ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (14:25 IST)

టైగర్ నాగేశ్వర రావు నుంచి గాయత్రి భరద్వాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్

gayatri bharadwaj
మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ "టైగర్ నాగేశ్వర రావు". నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లు. ఇందులో గాయత్రి పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించే ఈ చిత్రం ఈ నెల 20వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చాలాకాలం క్రితం స్టూవర్టుపురం దొంగగా అటు పోలీసులకు, ఇటు ప్రజలకు నిద్రలేని రాత్రులను గడిపించిన గజదొంగ 'టైగర్ నాగాశ్వర రావు' జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వదిలిన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతూ వచ్చింది. మాస్ యాక్షన్, ఎమోషన్‌కి ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రంలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లుగా నటించారు. తాజాగా రిలీజ్ చేసిన గాయత్రి లుక్ గ్రామీణ యువతిగా ప్రతి ఒక్కరి మనస్సులను కట్టిపడేస్తుంది. ఇందులో సీనియర్ నటి రేణూ దేశాయ్ కీలకమైన పాత్రను పోషించగా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో అనుపమ ఖేర్, నాజర్, ప్రదీప్ రావత్, మురళీ శర్మ, జిషు సేన్ గుప్తా తదితరులు కనిపించనున్నారు.