సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (18:02 IST)

జ‌గ‌న్ గారు వారంపాటు వంద శాతం ఆక్యుపెన్సీ ఇవ్వండి - న‌ట్టికుమార్‌

YS‌ Jagan, Nattikumar
కోవిడ్ మూడవ వేవ్ నేపథ్యంలో సినిమా థియేటర్ల విషయంలో ఎ.పి. ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇబ్బంది క‌లిగింది. దాంతో ప్ర‌క‌టించిన కొన్ని సినిమాలు రావాలా వ‌ద్దా! అనే డైల‌మాలో వున్నాయి. ఈ సంద‌ర్భంగా నిర్మాత న‌ట్టికుమార్‌,, జ‌గ‌న్‌కు సోమ‌వారంనాడు ఓ లేఖ రాశారు.
 
మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే. అయితే ముందుగా తేదీలు నిర్ణయించుకున్న పండగ సినిమాల కోసం  కనీసం ఓ వారం రోజుల పాటు థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ కి, అలాగే రాత్రి పూట అదనంగా ఇంకో గంట వెసులుబాటు ఇస్తూ, సెకండ్ షో కోసం రాత్రి 12 గంటల వరకు దయచేసి అనుమతి మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి. 
 
RESPECTED SIR, 
               కోవిడ్ మూడవ వేవ్ నేపథ్యంలో కేసులు పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా తమరు  సినిమా థియేటర్లలో విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే పండగ వేళల్లో సినిమాలు చూసేందుకు ఎక్కువమంది మొగ్గు చూపుతుంటారు.  కాబట్టి ఆ సమయంలో సినిమా కలెక్షన్స్ మరింత ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే  భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను దృష్టిలో పెట్టుకుని అనేక సినిమాలను విడుదల చేసేందుకు తెలుగు సినీ పరిశ్రమలోని పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకుని, ప్రచారంతో ముందుకు వెళుతున్నారు. కోవిడ్ విజృంభిస్తున్నందువల్ల మా థియేటర్ల వారు తప్పకుండా శానిటైజ్ చేస్తూ, జనాల చేత తప్పకుండా  మాస్కులు ధరింపజేయించి, థియేటర్ల లోపలికి అనుమతిస్తూ,, కచ్చితంగా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటారు.  
 
50  ఆక్యుపెన్సీ వల్ల  సినిమాలకు కలెక్షన్స్ చాలా మటుకు తగ్గిపోతాయి,.తమరు పెద్ద మనసు చేసుకుని నిర్మాతలు నష్టపోకుండా కనీసం పండగ రోజుల్లో  ఓ వారం పాటు 100 శాతం ఆక్యుపెన్సీకి  అనుమతి మంజూరు చేయవలసిందిగా మా నిర్మాతల, ఇతర చిత్ర పరిశ్రమ వర్గాల తరపున మీకు విజ్ఞప్తి చేయుచున్నాను. అలాగే Curfew విషయంలో  కనీసం రాత్రి పూట ఇంకో గంట సమయాన్ని కూడా  ఓ వారం రోజులు పాటు పెంచి 12 గంటల వరకు థియేటర్లకు అనుమతి ఇచ్చినట్లయితే సెకండ్ షో ప్రదర్శించుకునే వీలుంటుంది. తద్వారా ముందుగా విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ ప్రకారం ప్రచారంతో ముందుకు వెళుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ కు చాలా ఊరట కలుగుతుందని మీకు మనవి చేస్తున్నాను.. సినీరంగంలో  పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరూ బావుండాలి.. ముఖ్యంగా  చిన్న నిర్మాతలే అధికంగా చిత్రాలను తీస్తుంటారు. ఏడాదిలో 80 శాతం చిన్న సినిమాలే నిర్మాణమవుతుంటాయి. అలాంటి చిన్న నిర్మాతలను, సామాన్య ప్రేక్షకులను మీరు ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకుని సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో జీవో 35 తీసుకుని వచ్చారు. తాజాగా టిక్కెట్ల రేట్ల విషయంలో మరో మంచి నిర్ణయం తీసుకుని, పెద్ద, చిన్న నిర్మాతలు అందరూ బావుండేలా తమరు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. అని తెలిపారు.