సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2023 (15:22 IST)

హృతిక్ శౌర్య హీరోగా పేపర్ కట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓటు

Hrithik Shaurya
Hrithik Shaurya
హృతిక్ శౌర్య హీరోగా ఫ్లిక్ నైన్ స్టూడియోస్ ప్రొడక్షన్ నెం 1గా రవి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'ఓటు' అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. 'చాలా విలువైనది' అనేది ట్యాగ్ లైన్. ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా వుంది. పేపర్ కట్స్ బ్యాక్ డ్రాప్ లో హీరో హృతిక్ శౌర్య సీరియస్ గా ఆలోచిస్తూ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు.
 
ఈ చిత్రంతో హృతిక్ శౌర్య హీరోగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ లుక్ లో చాలా ప్రామెసింగ్ గా కనిపించారు. తన స్క్రీన్ ప్రెజెన్స్ డైనమిక్ గా వుంది. హీరోయిన్ గా తన్వినేగి నటిస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇప్పుడు ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
 
ఫ్లిక్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అగస్త్య సంగీతం అందిస్తున్నారు. ఎస్ రాజశేఖర్ డీవోపీ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ ఎడిటర్. మోహన్ తాళ్లూరి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రామకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్.