శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (18:49 IST)

పడి పడి లేచే మనసు నుంచి.. #HrudhayamJaripe Lyrical (వీడియో)

శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన పడి పడి లేచే మనసు సినిమా ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా నిర్మితమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. హృదయం జరిపే అంటూ సాగే ఈ పాట యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా వుంది. 
 
''నువ్వు నడిచే ఈ నేలపైనే.. నడిచానా ఇన్నాళ్లుగానే.." అంటూ సాగే లిరిక్స్ బాగున్నాయి. మిడిల్ క్లాస్ అబ్బాయి హిట్ తర్వాత ఈ సినిమా ద్వారా సాయిపల్లవి మంచి మార్కులు కొట్టేయాలని భావిస్తోంది. ఈ సినిమాపై శర్వానంద్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ పాటలో సాయి పల్లవి, శర్వానంద్‌ల కెమిస్ట్రీ బాగుంది. ఈ లిరికల్ సాంగ్ వీడియోను ఓ లుక్కేయండి..