ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (16:41 IST)

నేను సెల్ఫీష్ కాను అంతా ప్రచారమే : అనసూయ భరద్వాజ్

Anasuya
Anasuya
నటి అనసూయ భరద్వాజ్ ఎక్కడున్నా క్రీజేనే. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ ఇటీవల  సైలెంట్ అయింది. సినిమాలలో బిజీగా ఉన్న ఆమె తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎదో రకంగా కనిపించే ఆమెపై పెద్ద సెల్ఫీష్ అనే ముద్ర ఉంది.  దానికి ఈ విధంగా చెపుతుంది. నన్ను అందరూ చాలా సెల్ఫీష్ అని అంటుంటారు. కానీ నేను లేకున్నా సినిమా బాగుందని చెబుతున్నానంటే అర్థం చేసుకోవాలి. చాలా బాగుంటుంది సినిమా అని తెలిపింది.
 
 'మాయా పేటిక' ఫస్ట్ లుక్ లాంచ్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంది.  కామెడీ, డ్రామా జోన‌ర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అనసూయ భరద్వాజ్ నిన్న రాత్రి హైద్రాబాడ్ లో విడుదల చేశారు. అనసూయ మాట్లాడుతూ.. 'జస్ట్ ఆర్డినరీ బ్యానర్ అంటే నాకు ఫ్యామిలీ లాంటిది. మళ్లీ ఇలా అందరినీ ఇక్కడ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చూశాను. చాలా చాలా బాగుంది. సినిమా అందరికీ నచ్చుతుంది. నేను ఈ సినిమాలో లేకున్నా చెబుతాన్నంటే అర్థం చేసుకోండి. అని అన్నారు.