నా దగ్గర ముగ్గురు, నలుగురు హీరోల కథలున్నాయి- రాజమౌళి
రౌద్రం రణం రుధిరం (ఆర్.ఆర్.ఆర్.)ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఆదరణకు చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ శనివారం ఉదయం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. రామ్‌చరణ్, తారక్, ఆలియాభట్, రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య తదితరులు విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
బాహుబలి, ఆర్.ఆర్.ఆర్. సినిమాల్లో ఇద్దరు హీరోలు. ఒకరిది ఎక్కువ తక్కువ అనే తేడా అనిపించలేదా? గతంలో సూపర్‌స్టార్ కృష్ణ, శోభన్‌బాబు కలిసి నటించిన `మహా సంగ్రామం` విడుదలయ్యాక శోభన్ బాబు ఫ్యాన్స్ ఆయన పాత్ర తక్కువగా వుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు మాస్ ఫాలోయింగ్ వున్న చరణ్, ఎన్.టి.ఆర్. పాత్రలు గురించి ఎలా చెబుతారు?
దీనికి రాజమౌళి సమాధానమిస్తూ, ఇద్దరు హీరోలు ఇమేజ్ కాకుండా కథ ప్రకారం పాత్రలనే చూసుకున్నాన్నా. చిరంజీవి ఫాలోయింగ్, ఎన్.టి.ఆర్. ఫాలోయింగ్ అనేవి నేను చూడలేదు. కథ చెప్పినప్పుడే వారికి ఈ విషయం తెలుసు. అందుకే ఇద్దరి పాత్రలు ఎలా డిజైన్ చేశాను. అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది సినిమా చూశాక మీరే చెబుతారని అన్నారు.
ఇంకా రాజమౌళి మాట్లాడుతూ, నా దగ్గర చాలా వేరియేషన్ కథలు వున్నాయి. ఇద్దరు హీరోలేకాదు ముగ్గురు, నలుగురు హీరోలు కలిసిచేసే కథలు కూడా వున్నాయి. భవిష్యత్‌లో అవి చేయాలనుంది అని వెల్లడించారు.