కొమరం భీమ్‌ను బ్రిటీష్ సేనాధిపతి రామ్‌చరణ్ అరెస్ట్ చేశాడు - ఆర్.ఆర్.ఆర్. కథలో ట్విస్ట్ అదుర్స్
రౌద్రం, రణం, రుధిరం ట్రైలర్ గురువారం 11గంటలకు వచ్చేసింది. ఆదిలాబాద్‌లోని ఓ అధికారిగా రాజీవ్ కనకాల బ్రిటీష్ అధికారితో - స్కాట్ దొరవారు మా ఆదిలాబాద్ వచ్చినప్పుడు పిల్లను తీసుకువచ్చారు గోండు పిల్లను- అని అంటాడు. దాంతో స్కాట్ దొరవారు పక్కన బంటు. అయితే వారికి రెండు కొమ్ములుంటాయా! అని ప్రశ్నిస్తాడు. కాదు. ఓ కాపరి వుంటాడు. అని రాజీవ్ బదులిస్తాడు. ఆ కాపరే ఎన్.టి.ఆర్.
ఆ వెంటనే గోండుగా ఎన్.టి.ఆర్. రెండు చేతులను కట్టబడి వుంటాడు. పులిమీదకు వస్తుంది. దానితోపాటే గాండ్రిస్తాడు.
- పులిని పట్టుకోవాలంటే వేటాడేవాడు కావాలి. ఆ పని చేయగలిగింది ఒక్కడే సార్.. అనే వాయిస్ వస్తుంది. ఆ వెంటనే రామ్‌చరన్ బ్రిటీష్ సైనిక డ్రెస్‌లో కనిపిస్తాడు.
ఆ తర్వాత ఎన్.టి.ఆర్, రామ్‌చరణ్ కలిసి స్నేహితులుగా మారిపోతారు. ఆ టైంలో
ప్రాణం కంఒటే విలువైంది నీ సోపతి అన్నా.. గర్వంగా నీతో కలిసిపోతాను అన్నా.. అంటాడు ఎన్.టి.ఆర్. చారణ్‌తో. అలాఇద్దరూ స్నేహితులుగా మారతారు.
కట్ చేస్తే, మరో షాట్‌లో గోండు పిల్లను సైనికాధికారి తలమీద బలంగా కొడతాడు. ఏడుస్తుంది. మరో షాట్‌లో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగినందుకు అరెస్ట్ చేస్తున్నానంటూ.. రామ్‌చరణ్ సైనిక డ్రెస్‌లో వచ్చి ఎన్.టి.ఆర్.ను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మరో షాట్ లో రామ్ చరణ్ రగులుతున్న అగ్నిమంటలోంచి అల్లూరి సీతారామరాజు గెటప్‌లో బాణాలు సంధిస్తాడు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ .బాంబులు కురిపిస్తాడు..
ఇలా ఆసక్తికరంగా సాగిన ఆర్.ఆర్.ఆర్. ట్రైలర్ వుంది. ఎన్.టి.ఆర్. రామ్‌చరన్ ఇద్దరూ విరోధులు, స్నేహితులుగా ఎలా మారారనేది పాయింట్‌ను దర్శకుడు రాజమౌళి సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ఇది ఇద్దరి అభిమానులకు పండుగలా అనిపించింది. జనవరిలో విడులకానున్న ఈ సినిమాలో త్వరలో మరో న్యూస్ రాబోతుందని రాజమౌళి తెలియజేశాడు.