నేను 2 రోజుల్లోనే బయటకు వచ్చానంటే మీకు ఈపాటికే అర్థమై వుంటుంది: యాంకర్ శ్యామల భర్త
చీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త అరెస్టయిన సంగతి తెలిసిందే. యాంకర్ శ్యామల భర్త తన వద్ద కోటి రూపాయలు తీసుకుని మోసం చేసారనీ, డబ్బు ఇవ్వమంటే బెదిరిస్తున్నారంటూ ఓ మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్యామల భర్త తన అరెస్టుపై స్పందించారు.
గండిపేటకు సమీపంలో వున్న 4 ఎకరాల వెంచర్ కోసం కోటి రూపాయల పెట్టుబడితో ఒప్పందం జరిగిందనీ, ఈ వ్యవహారంలో పరస్పరం అభిప్రాయభేదాలు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సింధూర అనే మహిళ యాంకర్ శ్యామల భర్తపై ఫిర్యాదు చేశారు.
దీనిపై శ్యామల భర్త నరసింహారెడ్డి మాట్లాడుతూ... తనపై తప్పుడు కేసు పెట్టారనీ, రెండ్రోజుల్లోనే నేను బయటకు వచ్చానంటే ఆ కేసు ఎలాంటిదో మీకు ఈపాటికే అర్థమై వుంటుందన్నారు. మరో రెండ్రోజుల్లో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలిపారు.