గురువారం, 31 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (13:38 IST)

బుచ్చిబాబు దర్శకత్వంలో చెర్రీ జోడీగా జాన్వీ కపూర్?

jhanvi kapoor
"ఉప్పెన" చిత్రంతో ఓ గుర్తింపుతో పాటు... మంచి పేరు దక్కించుకున్న యంగ్ టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇది రామ్ చరణ్‌కు 16వ చిత్రం. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. కొన్ని పాత్రలకి సంబంధించి విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం, సాలూరు తదిత ప్రాంతాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అదేసమయంలో హీరోయిన్ ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో "దేవర" చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారు. అయితే, చిత్ర బృందం మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 
 
ఇదిలావుంటే రామ్ చరణ్ ప్రస్తుతం ఎస్.శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే మరో ప్రాజెక్టును లైన్లో పెట్టారు. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయడం గమనార్హం.