ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (20:23 IST)

జూనియర్ ఎన్టీఆర్ కుమారులకు సర్ ప్రైజ్ గిఫ్టిచ్చిన అలియా భట్

మల్టీ-టాలెంటెడ్ నటి అలియా భట్‌కు మంచి పేరుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే అలియా భట్.. జూనియర్ ఎన్టీఆర్ కుమారులకు స్వీట్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన అలియా భట్.. జూనియర్ ఎన్టీఆర్ కుమారులు నందమూరి అభయ్ రామ్, నందమూరి భార్గవ్ రామ్‌లకు మనోహరమైన దుస్తులను పంపింది. 
 
జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని షేర్ చేశాడు. అలియాభట్ బహుమతులకు కృతజ్ఞతలు తెలిపాడు. దీనిపై స్పందించిన అలియా భట్ జూనియర్ ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ విషయాన్ని షేర్ చేసినందుకు "స్వీటెస్ట్" అని పిలిచింది. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.