గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (19:34 IST)

గ్రాండ్ విజువ‌ల్స్‌తో కిచ్చా సుదీప్ విక్రాంత్ రోణ ట్రైల‌ర్ రిలీజ్

Kicha Sudeep Vikrant Rona
Kicha Sudeep Vikrant Rona
ఎట్ట‌కేల‌కు ఇటు అభిమానులు, అటు సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న భారీ బ‌డ్జెట్ కిచ్చా సుదీప్ చిత్రం ‘విక్రాంత్ రోణ’ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌తో అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో ట్రైల‌ర్ మెస్మ‌రైజ్ చేస్తోంది. ట్రైల‌ర్ చూస్తుంటే  సినీ ప్రేమికులు  ‘విక్రాంత్ రోణ’ మూవీ ఒక విజువ‌ల్ ట్రీట్ అని అర్థ‌మ‌వుతుంది. 
 
కిచ్చా సుదీప్‌ ‘విక్రాంత్ రోణ’ సినిమాపై అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా! ఎలా ఉండ‌బోతుంద‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ త‌రుణంలో అంద‌రి అంచ‌నాల‌కు మించి త్రీడీ ఫార్మేట్‌లో రూపొందించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌  ‘విక్రాంత్ రోణ’ ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుద‌ల చేసింది. ఇందులో వండ‌ర్‌ఫుల్ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో కిచ్చా సుదీప్ ఎంట్రీ నుంచి ఎన్నో సూప‌ర్బ్ స‌న్నివేశాలు మ‌న‌కు క‌నిపిస్తున్నాయి. ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను చూర‌గొంటున్నాయి. 
 
ఆశ్చ‌ర్య‌ప‌రిచే త్రీడీ విజువ‌ల్స్‌తో ఓ గ్రామం సెట్‌ను కెమెరాలో ఎంతో గొప్ప‌గా ఆవిష్క‌రించారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా, అబ్బుర ప‌డేలా భారీ షిప్‌పై కిచ్చా సుదీప్ ఎంట్రీ ఉంది. అలాగే హాట్ లుక్‌లో జాక్వ‌లైన్ అంద చందాల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను దోచుకుంది.  ట్రైల‌ర్ ఆడియెన్స్‌కి ప‌ర్ఫెక్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు.  ఈ సినిమా ట్రైల‌ర్‌ను ముంబైలో రిలీజ్ చేశారు. అక్క‌డి మీడియా స‌హా వ‌చ్చిన అతిథులు  ‘విక్రాంత్ రోణ’ సినిమాలోని రా రా రాక్క‌మా పాట‌ను ఎక్స్‌క్లూజివ్‌గా వీక్షించారు.
 
ఇంకా ట్రైల‌ర్ చూసే క్ర‌మంలో వివిధ సినీ రంగాల‌కు చెందిన పెద్ద తార‌ల పేర్లు చూడ‌గానే ఆశ‌ర్య‌పోతామ‌న‌టంలో ఎలాంట సందేహం లేదు. ‘విక్రాంత్ రోణ’ హిందీ ట్రైల‌ర్‌ను స‌ల్మాన్ ఖాన్‌.. త‌మిళ ట్రైల‌ర్‌ను ధ‌నుష్‌.. మ‌ల‌యాళ ట్రైల‌ర్‌ను దుల్క‌ర్ స‌ల్మాన్‌.. తెలుగు ట్రైల‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్.. క‌న్న‌డ ట్రైల‌ర్‌ను కిచ్చా సుదీప్ విడుద‌ల చేశారు. 
 
జూలై 28న ‘విక్రాంత్ రోణ’త్రీడీ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కిచ్చా సుదీప్ న‌టించిన ఈ చిత్రాన్ని అనూప్ భండారి డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ చిత్రంలో జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. స‌ల్మాన్ ఖాన్ ఫిలింస్ స‌మ‌ర్ప‌ణ‌లో జీ స్టూడియోస్‌, కిచ్చా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉత్త‌రాదిన రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై జాక్ మంజునాథ్ నిర్మించారు. ఇన్‌వెనియో ఆరిజ‌న్స్ బ్యాన‌ర్‌పై అలంకార్ పాండియ‌న్ ఈ సినిమాకు స‌హ నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు. పి.వి.ఆర్ పిక్చ‌ర్స్ ఈ సినిమాను ఉత్త‌రాదిన డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.