1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (13:46 IST)

స‌రికొత్త ట్రెండ్‌ గా కొర‌మీను టీమ్‌ ను ఆహ్వానం ప‌లికిన లక్కీ లక్ష్మణ్ టీమ్‌

Sohail, Moksha and others
Sohail, Moksha and others
బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న సినిమాల‌కు సంబంధిచి ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ టీమ్ ఓ కొత్త ఒర‌వ‌డిని తీసుకొచ్చారు. కొర‌మీను టీమ్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆహ్వానించారు. ఎందుకంటే డిసెంబ‌ర్ 31న కొర‌మీను సినిమా రిలీజ్ అవుతుంది. ఒక‌రికొక‌రు స‌పోర్ట్ అందించుకుంటూ ముందుకు సాగే స‌రికొత్త ట్రెండ్‌కి ఈ రెండు సినిమా యూనిట్స్ ఆహ్వానం ప‌లికాయి.  ఈ సంద‌ర్భంగా  కొర‌మీను సినిమా హీరో ఆనంద్ ర‌వి, హీరోయిన్ కిశోరి ధ‌త్రిక్.. ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అతిథులుగా విచ్చేసి ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించాలని విషెష్ తెలిపారు.
 
 ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత  గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈవెంట్‌లో బిగ్ టికెట్‌ను డైరెక్టర్ అభి తండ్రి గంగిరెడ్డి ఆవిష్కరించి సోహైల్ తండ్రి సలీమ్‌కి అందించారు. 
 
 
Lucky Laxman team and koramenu team
Lucky Laxman team and koramenu team
ఈ సంద‌ర్భంగా హీరో సోహెల్ మాట్లాడుతూ.. 'నేను ఈ స్థాయికి రావడం తెలుగు ప్రజలు. ప్రతీ సక్సెస్ మెన్ వెనుక ఉమెన్ ఉంటుందని అంటారు. కానీ నా సక్సెస్ వెనుక మా నాన్న ఉన్నాడు.. సినిమా కంటెంట్‌ను నమ్మి చేస్తున్నామని డైరెక్టర్ ఎప్పుడూ చెబుతూనే వచ్చారు. ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. అనూప్ అన్న మంచి సంగీతాన్ని అందించారు. ఆండ్రూ గారి కెమెరా వర్క్ బాగుంది. హరిత గారు డేరింగ్ అండ్ డాషింగ్ నిర్మాత. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వుతారు, ఏడుస్తారు.అని అన్నారు.
 
డైరెక్టర్ అభి మాట్లాడుతూ.. ఈ సినిమాలోని ప్రతీ పాత్రకు సెకండ్ చాయిస్ లేదు. ఆ విషయంలో నేను చాలా లక్కీ. అందరూ కథ విన్న వెంటనే కారెక్టర్లకు ఓకే చెప్పారు. మోక్ష చాలా బాగా నటించారు. ఆమె పాత్రతో అందరూ ప్రేమలో పడతారు. నిర్మాత  హరిత నన్ను నమ్మంది. నాది లక్కీ కాదు.. అంతకు మించి. ప్రతీ క్రాఫ్ట్‌లో హరిత ఇన్వాల్వ్ అయింది అని అన్నారు.
 
నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ, పనే దైవంగా భావిస్తుంటా. ఏం చేసినా కూడా అదే నమ్ముతాను.  బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా ఇది మాకు చాలా పెద్ద సినిమా. కంటెంట్ ఉన్న మూవీస్‌ను తెలుగు ఆడియెన్స్‌ ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.
 
హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ, నేను తెలుగు అమ్మాయిని కాదు. కానీ ఇప్పుడు ఇండియాలో తెలుగు ఇండస్ట్రీ టాప్‌లో ఉంది. అలాంటి ఇండస్ట్రీలో నాకు అవకాశం ఇచ్చారు.  ఇది మా మొదటి సినిమా. అందరూ చూసి మా సినిమాను సక్సెస్ చేయండి. జయహో తెలుగు సినిమా' అని అన్నారు.
 
జుబేదా అలీ మాట్లాడుతూ.. 'సోహైల్‌ నా తమ్ముడులాంటి వాడు. ఈ సినిమా డిసెంబర్ 30న రాబోతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మా ఆయన అలీ కూడా ఇక్కడకు రావాల్సి ఉంది. కానీ ఆయన షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. ఈ సినిమాను ఆడియకెన్స్ ఆశీర్వదించాల'ని కోరుకుంటున్నాను.
 
కొరమీను హీరో ఆనంద్ రవి, హీరోయిన్ కిశోరి ధత్రిక్ మాట్లాడుతూ.. సోహైల్‌గారి క్రేజ్ చూస్తుంటే మామూలుగా లేదు. థియేట‌ర్స్‌కు వెళ్లి డిసెంబ‌ర్ 30న ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమాను చూడండి. అలాగే డిసెంబ‌ర్ 31న మా కొర‌మీను సినిమాను చూసి ఆశీర్వ‌దించండి. థాంక్యూ..’’ అన్నారు. 
 
రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. 'నో వేర్ టు సమ్ వేర్ అనే డైలాగ్‌కు సోహైల్‌ ప్రతిబింబంలా అనిపిస్తుంది. అతనికి సినిమా అనే పిచ్చి ఉంది. నిర్మాత హరిత గారికి బాగా డబ్బులు రావాలి. సినిమా మంచి విజయాన్ని సాధించాలి' అని అన్నారు.
 
ఇంకా  దేవిశ్రీ ప్రసాద్, ఆర్పీ పట్నాయక్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, సాయి రాజేష్‌, రాజా రవీంద్ర, ఇనయ, మెహబూబ్, సమీర్ మాట్లాడుతూ సినిమా మంచి విజయాన్ని సాధించాలి కోరారు.