శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2024 (17:43 IST)

బాబాయ్ ఇడ్లి, దోశ తింటే కడుపుతో పాటు మనసూ నిండినట్టు అనిపిస్తుంది : కిరణ్ అబ్బవరం

babai hotel owners
babai hotel owners
కరోనా తరువాత జనాల మైండ్ సెట్ మారింది. మంచి ఫుడ్‌ను, హైజీన్ ఫుడ్‌ను తినేందుకు ఇష్టపడుతున్నారు. అలా ఎంతో రుచికరమైన, శుచికరమైన ఫుడ్‌ను అందిస్తోంది బాబాయ్ హోటల్. బాబాయ్ హోటల్ గత కొన్ని రోజులుగా సెలెబ్రిటీల తాకిడితో బాగానే ట్రెండ్ అవుతోంది. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాదాపూర్‌లో బాబాయ్ హోటల్‌ ప్రారంభ కార్యక్రమంలో సందడి చేశాడు.
 
Babai Hotel opend by hero Kiran Abbavaram
Babai Hotel opend by hero Kiran Abbavaram
టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరంతో పాటు బాబాయ్ హోటల్ ఓనర్స్ కేవీ దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి కలసి హైదరాబాద్‌ లోని మాదాపూర్‌ మెట్రో పిల్లర్ C1766 నందు బాబాయ్ హోటల్ కొత్త బ్రాంచ్ ను ప్రారంభించారు. మానవాళికి ఆహారం పట్ల సహజంగానే ఇష్టం, ప్రేమ ఉంటుంది. రుచికరమైన పదార్ధాలు, మంచి ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతుంటారు.  ఇష్టమైన, నచ్చిన ఆహారం తిన్నప్పుడు మనసు సంతృప్తి చెందడం సర్వసాధారణం. ఇక కిరణ్ అబ్బవరం బాబాయ్ హోటల్ గురించి చెబుతూ.. ‘బాబాయ్ ఇడ్లి, దోశ అంటే నాకు చాలా ఇష్టం. వాటిని తింటుంటే నా కడుపుతో పాటు మనసు కూడా నిండినట్టుగా అనిపిస్తుంది’ అని అన్నారు.
 
‘గత 8 దశాబ్దాలుగా బాబాయ్ హోటల్ రుచికరమైన ఆహారాన్ని అందిస్తోంది. దోస, ఇడ్లీ, వడ, ఉప్మా మొదలైన వాటిని ఆరగించేందుకు ఫేవరేట్ ప్లేస్‌గా మారింది. ఈ వంటలలో ప్రతి ఒక్కదానికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది.  దక్షిణ భారత వంటకాలు, రుచులను కొత్తగా అందించమే లక్ష్యం’  అని కేవీ దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి తెలిపారు.