సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2022 (20:15 IST)

యాక్షన్ మోడ్‌లో మహేష్ బాబు

Mahesh Babu
Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు షూటింగ్ మూడ్ లోకి వచ్చేసాడు. తన తండ్రి మరణం తర్వాత గ్యాప్ తీసుకొని షూటింగ్ మూడ్ లోకి వచ్చేసాడు. అందుకే తాజాగా యాక్షన్ ఎపిసోడ్స్ మహేష్ పై తీయనున్నారు. ఈ సందర్భంగా యాక్షన్ మోడ్‌లో మహేష్ బాబు ఫోటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్యం వహిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ శివారులో షూటింగ్ జరుపుకుంటున్నది.
 
మహేష్ బాబు పక్కన సంయుక్త మీనన్, పూజా హెగ్డే నటిస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. 'అల వైకుంఠపురములో', 'వకీల్ సాబ్', 'అఖండ', 'భీమ్లా నాయక్', 'సర్కారు వారి పాట' వంటి చిత్రాలకు అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లకు దర్శకత్వం వహించిన ఎస్ థమన్ 'SSMB 28'కి సంగీతం అందించనున్నారు.