శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 18 మే 2022 (17:57 IST)

మ‌హేష్‌బాబు హీరోయిన్‌పై కాలు వేయ‌డం తల్లి దగ్గర నిద్రపోయే బిడ్డలా వుంది - ద‌ర్శ‌కుడు పరశురాం

Parashuram
Parashuram
మహేష్ బాబు  ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'.  పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో సర్కారు వారి పాట దర్శకుడు పరశురాం మీడియాతో ముచ్చటించారు.
 
సర్కారు వారి పాట కథ కంటే మహేష్ బాబు గారి క్యారెక్టర్ పైనే ఎక్కువ ద్రుష్టిపెట్టారనే విమర్శ గురించి ఏం చెప్తారు?
క్యారెక్టర్ ఎంత కొత్తగా చేసినా కథ బలంగా లేకపోతే ఒక స్టార్ హీరో ఓకే చేయరు. సర్కారు వారి పాట కథ చాలా కొత్త పాయింట్. ఇలాంటి కథతో గతంలో ఎలాంటి సినిమా రాలేదు. మహేష్ గారు ఈ కథ ఓకే చేయడానికి కారణం కథే. ప్రతి సామాన్యుడు కష్టపడి బ్యాంక్ నుండి తీసుకున్న అప్పుని వడ్డీ అణాపైసాలతో సహా తిరిగి చెల్లిస్తున్నాడు. కానీ కొందరు కోట్ల రుపాయిలు తీసుకొని ఎందుకు కట్టడంలేదు .. ? ఈ అంశాన్నే హిట్ చేయాలని భావించాం. ఆ పాయింట్  వంద శాతం కన్వే అయ్యింది. కామన్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు. ఈ కథ మహేష్ గారికి చెప్పక ముందే చాలా మంది ప్రముఖులని కలిశాను. రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ ని కూడా సంప్రదించాను.
 
ఈ సినిమాలో హీరో మహేష్ పాత్ర హీరోయిన్‌కి  పాతిక వేల డాలర్లు అప్పుగా ఇస్తాడు. కానీ తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు  కేవలం పదివేల డాలర్లే అడుగుతాడు ? ఎందుకు అలా ?
హీరో, హీరోయిన్ కి ఇచ్చిన అప్పు పదివేల డాలర్లే. మిగతా పదిహేను వేల డాలర్లు ప్రేమలో వున్నపుడు ఇస్తాడు. ఇందులో ఎలాంటి కన్ఫ్యుజన్ లేదు.
 
ఫారిన్ లో అప్పులు, వడ్డీలు వసూలు చేసే హీరో.. ఇండియా కి వచ్చిన తర్వాత అప్పులు కట్టక్కర్లెదని చెప్పడం ఎలా సమర్ధిస్తారు?
మీరు కథని బాగా పరిశీలిస్తే అప్పులు కట్టవద్దని హీరో ఎక్కడా చెప్పడు. అందరూ కట్టాలనేదే హీరో పాయింట్.
 
మీరు కథలని రాయడానికి ఎలా స్ఫూర్తి పొందుతారు ? సర్కారు వారి పాట కథ ఎలా పుట్టింది ?
మెదడు నిరంతరంగా పని చేస్తూనే వుంటుంది కదా.. కొన్ని సంఘటనలు చూసినప్పుడు, చదివినప్పుడు , విన్నప్పుడు... ఇలా బోలెడు సందర్భాలు వుంటాయి. ఎక్కడో ఒక పాజ్ వస్తుంది. అక్కడి నుండి కథగా ఏర్పడే అవకాశం కూడా వుంటుంది.  సర్కారు పాట విషయానికి వస్తే.. ప్రతి కామన్ మ్యాన్ జీవితంలో జరిగేదే. కామన్ మ్యాన్ అడియాలజీ.
 
మీ రైటింగ్ స్టయిల్ ఇష్టమని మహేష్ బాబు చాలా సార్లు చెప్పారు. మీ రైటింగ్ లో ఆయనకి అంతగా నచ్చిన అంశం ఏమిటి ?
నాతో ప్రయాణంలో చిన్న ఫన్ వుంటుంది. మహేష్ గారికి నాకు బాగా సింక్ అయ్యింది. రైటింగ్ అంటే ఫ్లోలో వస్తుంటాయి. సీన్ డిమాండ్ చేసిన దాని బట్టి దాని డెప్త్ బట్టి నేచురల్ గా వస్తాయి.
 
సెకండ్ హాఫ్ లో హీరోయిన్ పై హీరో కాలు వేసిన సీన్స్ ని  ఎలా సమర్ధిస్తారు ?  
ఆ సీన్స్ లో ఎక్కడా వల్గారిటీ లేదు. అలాంటి వల్గారిటీ వుంటే మహేష్ గారే వద్దని చెప్తారు. తల్లి దగ్గర నిద్రపోయే ఒక బిడ్డలా ఆ సీన్స్ ఉంటాయి తప్పితే అందులో వల్గారిటీ లేదు.  
 
నాగచైతన్య సినిమా షూటింగ్ ఎప్పుడు ?
స్క్రిప్ట్ పూర్తయింది. షూటింగ్ వివరాలు త్వరలోనే చెప్తాం.