శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (19:03 IST)

మెగా బ్రదర్ నాగబాబు విడుదల చేసిన మరో ప్రేమకథ ఐటెం సాంగ్ ?

Item Song
శ్రావణ్ వై జి టి, షీతల్ భట్ జంటగా కె బిక్షపతి దర్శకత్వంలో  రుద్రక్రాంతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై వెంకటేశం నిర్మిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ మరో ప్రేమకథ. ఈ చిత్రంలోని ఐటెం సాంగ్ ని ప్రముఖ నటులు నిర్మాత నాగబాబు విడుదల చేసారు.

ఈ సందర్బంగా మెగా బ్రదర్ నాగబాబు  మాట్లాడుతూ .. మరో ప్రేమకథ సినిమాలోని ఐటెం సాంగ్ ని లాంచ్ చేశాను. శ్రవణ్ హీరోగా చేసిన ఈ సినిమాకు పండు కొరియోగ్రాఫర్, పండు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి,  అతనికి ఇది డెబ్యూ ఫిలిం అయినా చాలా బాగా చేసాడు. డాన్స్ మూమెంట్స్ అన్ని బాగున్నాయి.
Maro prema katha


ఈ సాంగ్ తో పాటు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయి నిర్మాత, దర్శకుడికి మంచి పేరు రావాలని, అలాగే హీరోగా పరిచయం అవుతున్న శ్రవణ్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. 
 
మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ .. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. బిక్షపతి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ రోజు నాగబాబు గారు ఫుల్ సాంగ్ ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. అందులో మాస్ సాంగ్ బాగా పాపులర్ అయింది. ఈ ఐటెం సాంగ్ లో నటించింది నమృత మల్ల, శ్రవణ్ కూడా అదరగొట్టాడు, సినిమా చాలా బాగా వచ్చింది.. తప్పకుండా ప్రేక్షకులు ఫుల్ ఎంటర్ టైన్ ఫీల్ అవుతారు అన్నారు. 
Maro prema katha
 
కొరియోగ్రాఫర్ పండు మాట్లాడుతూ.. ఇందులో ''నల్లాని కాటుక'' అనే సాంగ్ ని కొరియోగ్రఫీ చేశాను. ఈ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ సాంగ్ ని చేసే అవకాశం ఇచ్చిందనందుకు దర్శకుడు బిక్షపతి గారికి, నిర్మాత వెంకటేశం గారికి థాంక్స్ చెబుతున్నాను. ముక్యంగా ఈ పాటను డాడీ నాగబాబు గారు విడుదల చేయడం ఆనందంగా ఉంది అన్నారు.
 
ఐటెం గర్ల్ నమ్రత మల్ల మాట్లాడుతూ .. ఈ సినిమాలో హాట్ ఐటెం సాంగ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఢిల్లీ నుండి వచ్చాను, ఈ సాంగ్ కాన్సెప్ట్ బాగా నచ్చడంతో ఈ సాంగ్ చేశా, ఇంత మంచి సాంగ్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు. 
Maro prema katha
 
హీరో శ్రవణ్ మాట్లాడుతూ.. హీరోగా ఇది నా మొదటి సినిమా . ఈ సినిమాలోని మొదటి సాంగ్ ని నాగబాబు గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను మొదటినుండి మెగా అభిమానిని.. అలాంటింది మెగా బ్రదర్ చేతుల మీదుగా న సినిమా సాంగ్  విడుదల చేయడం మరచిపోలేని అనుభూతి. 

ఈ సాంగ్ తప్పకుండా చాలా ఊపునిస్తుంది. పాట చాలా నాటుగా ఉంటుంది, చాలా బాగా వచ్చింది. ప్రశాంత్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. రైటర్ నాగులు అద్భుతంగా రాసారు. పండు కొరియోగ్రఫీ తో మరో స్థాయికి తీసుకెళ్ళాడు. ఈ సాంగ్ షూటింగ్ ని అందరం బాగా ఎంజాయ్ చేసాం, తప్పకుండా ప్రేక్షకులు మా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని, అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను  అన్నారు. 
Maro prema katha
 
దర్శకుడు బిక్షపతి మాట్లాడుతూ .. ఇప్పటికే లిరికల్ వీడియొ డిసెంబర్ 25న విడుదలై వైరల్ అయింది. కొత్తవాళ్ళం సాంగ్ ఎలా ఉంటుందో అన్న అనుమానం ఉండేది.. కానీ లిరికల్ వీడియొ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. ఇప్పుడు వీడియొ సాంగ్ ని విడుదల చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది.

ఈ కథ అనుకున్నప్పుడే ఈ సాంగ్ ట్యూన్ అనుకున్నాను.. కానీ మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ దాన్ని ఇంకొస్తాయికి తీసుకెళ్లాడు. ఇక ఈ సాంగ్ కు పండు కొరియోగ్రాఫర్ గా అదరగొట్టాడు.. మాస్ పల్స్ బాగా పట్టేసాడు. ఈ సినిమాలో హీరో శ్రవణ్ కూడా కొత్త హీరోలా కాకుండా అనుభవం ఉన్న హీరోగా చేసాడు. నిర్మాత కె వెంకటేశం గారు కూడా ఎక్కడ బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా బిగ్ రేంజ్ లో నిర్మిస్తున్నాడు. అలాగే మా ఫోటోగ్రాఫర్ కూడా ఈ సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లాడు.. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం అన్నారు.
 
నిర్మాత వెంకటేశం మాట్లాడుతూ .. బిక్షపతి ఈ కథను చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఈ కంటెంట్ లో దమ్ముందన్న విషయం అర్థం అయింది. అలాగే దర్శకుడు చక్కగా తీసాడు.. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా కోసం టీం అందరు చాలా కష్టపడ్డారు. ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది అన్నారు.  
 
బ్యానర్: రుద్రక్రాంతి ఆర్ట్ క్రియేషన్స్
సినిమా: మారో ప్రేమకధ
తారాగణం: శ్రావన్ వై జి టి, షీతల్ భట్, నమృత మల్లా, మధుమణి, అప్పాజీ అంబరీష్, బాషా, త్రిశూల్, నుకరాజ్, విజయ కృష్ణ, తదితరులు ..
 
సాహిత్యం. : మార్తా నాగులు
సింగర్. : రాహుల్ సిప్లి గన్జ్
సంగీత దర్శకుడు: ప్రశాంత్ బిజె
DOP: మైసా రేక్స్
నిర్మాత. : వెంకటేసం
కొరియోగ్రఫీ: ధీ పాండు
సాంగ్స్ ట్యూన్స్ & డైరెక్టర్: కె బిక్షపతి.