శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (11:47 IST)

అన్నదాతలకు మెగాస్టార్ సెల్యూట్ - సొరకాయను పండించిన చిరు

జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాతలకు మెగాస్టార్ చిరంజీవి సెల్యూట్ చేశారు. దీనికి సంబంధించి ఆయన ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. 
 
ఈ వీడియోలో చిరంజీవి గతంలో తన పెరట్లో ఓ సొరకాయ విత్తనం నాటారు. అది పెరిగి పెద్దదై ఇపుడు ఓ కాయలు కాసింది. దీంతో చిరు తాను నాటిన విత్తనం పెరిగి, ఆ తీగకు కాసిన సొరకాయను చూసి ఆనందంలో మునిగిపోయారు. 
 
తెల్లటి చొక్క ధరించి, చిరు తన గార్డెన్‌లో నడుస్తున్నారు. ఆ తర్వాత చిరంజీవి తన చేతిలో సొరకాయలు పట్టుకుని చిరు ఆనందంతో రైతులకు సెల్యూట్ చేశారు. 
 
"తన పెరట్లో సొరకాయలు కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే మట్టి నుంచి పంట పండించి మనందరికీ అన్నం పెట్టే రైతుకు ఇంకెంత సంతోషపడాలి. అలా ఉండేలా మనమే చూసుకోవాలి. వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతుకీ నా సెల్యూట్"