మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (11:25 IST)

ఓటీటీలో మై డియర్ భూతం

My Dear Bootham
My Dear Bootham
స్టార్ డాన్స్ డైరక్టర్, హీరో, దర్శకుడు ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ భూతం’. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 
 
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసారు. ఈ సినిమా ఓటిటి రైట్స్‌ని జీ 5 వారు తీసుకున్నారు. సెప్టెంబర్ 2 నుంచి జీ5 ఓటిటిలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
 
ఈ చిత్రంలో ప్రభుదేవా జీనీగా నటించారు. ఆ గెటప్ పెద్దలతో పాటు పిల్లల్ని ఆకట్టుకుంది. ఇప్పటి వరకూ ఆయన నటించిన చిత్రాలకు భిన్నమైన చిత్రమిది. 
 
ఫాంటసీ కథతో రూపొందిన ఈ సినిమా జూలై 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులో అదే రోజు విడుదల అయ్యింది. ఈ రోజు నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది.