గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (16:06 IST)

ప్రతి ఒకరి మంచిని కోరుకునే వ్యక్తి కృష్ణంరాజు : పవన్ కళ్యాణ్

pawan kalyan
ప్రతి ఒక్కరి మంచిని కోరుకునే వ్యక్తి రెబెల్ స్టార్ కృష్ణంరాజు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం మృతి చెందిన కృష్ణంరాజు పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఓదార్చారు. హీరో ప్రభాస్‌ను, కృష్ణంరాజు సతీమణిని ఆత్మీయంగా పలుకరించి వారికి ధైర్య వచనాలు పలికారు.
 
అలాగే, సినీ నటి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ, కృష్ణంరాజు తనను, తన భర్త రాజశేఖర్‌ను సొంత మనుషుల్లా చూసుకునేవారన్నారు. ఆయన గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవని, అంత మంచి మనిషి అని వెల్లడించారు. ఆయనతో తమకు చాలా కాలం నుంచి పరిచయం ఉందని, 'మా' సంక్షోభం సమయంలో ఆయన తనను, రాజశేఖర్‌ను ఇంటిమనుషుల్లా భావించేవారని తెలిపారు. 
 
ఆయనకు 'మా' అంటే ప్రాణం అని, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏమైపోతుందోనని ఆందోళన చెందేవారని, ఎంతో సిన్సియర్‌గా పనిచేసేవారని జీవిత వివరించారు. 'మా' పరువు మర్యాద కాపాడేందుకు ఎంతో తపించిపోయారని, 'మా' పట్ల ఆయనకు తీవ్రమైన భావోద్వేగాలు ఉండేవని వివరించారు. బయటి వాళ్ల మధ్య పలుచన కాకూడదని 'మా' వాళ్లందరికీ చెబుతుండేవారని జీవిత రాజశేఖర్ గుర్తుచేశారు.