సోమవారం, 4 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (12:11 IST)

రాజకీయాలు ఇంత దిగజారాయా! ప్రకాష్ రాజ్, కమలహాసన్ ప్రశ్న !

kamal, prakashraj
kamal, prakashraj
రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యుడుగా అనర్హుడు అని లోక్ సభ సెక్రటేరియట్ ఈరోజు శనివారం గజిట్ జారీచేసింది. కేరళలోని వీనాధ్ పార్లమెంట్ కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిన్న సూరత్ కోర్ట్ 2 సంవత్సరాళ్ళు జైలు శిక్ష రాహుల్కు విధించింది. 2019లో ప్రచారంలో దొంగలందరికి మోడీ పేరు ఎందుకు ఉంటుంది అని ఆయన అన్న మాటలు 2023లో తీర్పు వచ్చేలా జరిగింది.

losabha gajit
losabha gajit
దీనిపై పలువురు ఘాటుగానే స్పందించారు. ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో ముగ్గురు  మోడీల ఫోటో పేట్టి. జనరల్ నాలాడ్జి.. వాట్ ఈస్ కామన్  హియర్.. అంటూ ప్రశ్న వేశారు. 
 
three modies
three modies
అంతే కాకుండా.. లోక్ సభ గజిట్ పోస్ట్ చేసి.. ప్రియమైన పౌరులారా .. ఇలాంటి రాజకీయాలకు సిగ్గుపడండి .. “మొత్తం రాజకీయ శాస్త్రం”  ఈ అసభ్యకరమైన తిరోగమన వైఖరి.. మనం మౌనంగా ఉంటే.. మనకు మరింత ఖర్చవుతుంది.. .. దేశం కోసం మాట్లాడే సమయం వచ్చింది. అంటూ తెలిపారు. 
 
ఇక లెజండరీ నటుడు,  డైరెక్టర్ కమల్హాస కూడా..  రాహుల్జీ, ఈ సమయాల్లో నేను మీకు అండగా ఉంటాను! మీరు మరిన్ని పరీక్షా సమయాలను, అన్యాయమైన క్షణాలను చూశారు. మన న్యాయవ్యవస్థ న్యాయవిచారణలో అవకతవకలను సరిదిద్దడానికి తగినంత బలంగా ఉంది. సూరత్ కోర్టు నిర్ణయంపై మీ అప్పీల్‌పై మీకు న్యాయం జరుగుతుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. అంటూ నిన్న తెలిపారు. కానీ నేడు.. సూరత్ కోర్ట్ శిక్ష వేసింది. రాజకీయం అంటే ఇదేనా? అంటూ నేడు ప్రశ్నించారు.