సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మార్చి 2020 (10:24 IST)

రాహుల్‌పై దాడి.. పునర్నవి నోరెత్తలేదే.. ఏమైంది? గ్యాప్ వచ్చిందా?

బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య గ్యాప్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం రాహుల్‌పై జరిగిన దాడి ఘటన రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. పబ్‌లో ఈయనపై జరిగిన దాడి సంచలనంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి తనపై దాడి చేసాడంటూ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాడు రాహుల్. 
 
అయితే ఈ దాడి జరిగిన తర్వాత కచ్చితంగా పునర్నవి నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందేమో అని అందరూ ఊహించారు. కానీ కనీసం రియాక్షన్ కాదు కదా చిన్న సింపతీ స్టేట్‌మెంట్ కూడా రాలేదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడా స్పందించినట్లు దాఖలాలు అయితే కనిపించలేదు. 
 
ఇప్పటి వరకు అఫీషియల్‌గా రాహుల్ ఘటనపై పున్ను అయితే మాట్లాడలేదు.. నోరు విప్పలేదు. మరి స్నేహితుడు అన్నాక స్పందించాలి కదా అంటున్నారు నెటిజన్లు. కానీ పున్ను మాత్రం ఈ వ్యవహారంపై నోరెత్తలేదు.