ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2023 (16:12 IST)

మహిళపై సామూహిక అత్యాచారం.. దుస్తులు లేకుండా రోడ్డుపై పరుగులు

victim
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళను కొందరు కామాంధులు చెరబట్టి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా రోడ్డుపై పరుగులు తీయించారు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని బిల్వారా ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తనను కలవాలని ఆ వ్యక్తి కోరాడు. అందుకు ఆ మహిళ నిరాకరించింది. ఈ క్రమంలో ఆ మహిళ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్ళగా, ఆమెను ఫాలో అవుతూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అయితే, ఆ కామాంధుల నుంచి తప్పించుకున్న ఆ మహిళ... శరీరంపై దుస్తులు లేకుండానే నగ్నంగా పరుగెత్తుతూ గ్రామానికి చేరుకుంది. దీన్ని గమనించిన ఆ గ్రామస్థులు ఆ మహిళకు దుస్తులు ఇచ్చి, పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన చోటు, గిరిధర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది.