1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (20:06 IST)

ఉల్లిపొర లాంటి చీర.. రమ్యకృష్ణ అందాలు అదరహో..

Ramya Krishnan
Ramya Krishnan
డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్‌' మూవీలో మరో పవర్‌ఫుల్‌ పాత్రతో ముందుకు రానుంది రమ్యకృష్ణ. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడీగా నటించిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహిస్తోంది చిత్రబృందం. 
 
తాజాగా ఈ ప్రమోషన్స్‌లో రమ్యకృష్ణ పాల్గొంది. ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ అందాలతో కనువిందు చేసింది. స్టూడియో బయట ఫొటోగ్రాఫర్లకు ఫోజులిస్తూ సందడి చేసింది. సన్నని గాలి తాకుతుంటే పలుచని చీరలో రమ్యకృష్ణ అందాలు మతిపోగెట్టేలా చేశాయి. 
 
గాలికి చీర సర్దుకుంటూ, జుట్టు సవరించుకుంటూ దర్శనమిచ్చింది శివగామి. అయితే అలా గాలికి చీర జరగడంతో రమ్యకృష్ణ కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.