1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (17:16 IST)

నా హార్ట్‌ బ్రేక్ చేసాడని నిజాన్ని చెప్పేసిన రష్మి గౌతమ్‌

Rashmi-SKN
Rashmi-SKN
మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకు కూడా హాట్‌బ్రేక్‌ లుంటాయి. అంటూ నటి, యాంకర్‌ రష్మి గౌతమ్‌ నిజాన్ని నిర్భయంగా చెప్పేసింది. జబర్‌దస్త్‌ ప్రోగ్రామ్‌లో నటుడు సుడిగార్‌ సుధీర్‌తో చనువుగా వుండడం ప్రేమగా మారడం వీరిద్దరూ ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని మరలా నటించడం జరిగింది. తాజాగా రష్మి గౌతమ్‌ తన మనసులోని మాటను ఓ స్టేజీపై చెప్పేసింది. కన్నడ సినిమా బాయ్స్‌ హాస్టల్‌లో నటించింది. అందులో ఓ టీచర్‌గా నటించింది. అదికూడా గ్లామర్‌ పాత్ర.
 
దీనిపై ఆమె మాట్లాడుతూ, బాయ్స్‌ హాస్టల్‌లో బాయ్స్‌ గురించి చెప్పారు. మాకూ చాలా చెప్పాలనుంటుంది. మాకూ హార్ట్‌బ్రేక్స్‌ వుంటాయి. ఆ కథతో సినిమా తీయమని బేబి చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్‌.ను ఆమె అడిగింది. తప్పకుండా చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే మిమ్మల్ని హార్ట్‌ బ్రేక్‌ చేసినవారి లిస్ట్‌ ఎంతమంది అని విలేకరి అడగగా.. అది నిర్మాతకే నేను చెబుతా. అంటూ సెటైర్‌ వేసింది.  ఆ నిర్మాత.. పద వెళతాం అంటూ కాసేపు చేయిపట్టుకుని మూమెంట్‌ ఇచ్చాడు. సో. అందరికీ హార్ట్‌ బ్రేక్స్‌ వుంటాయి. అందులో ఆడవారు మినహాయింపుకాదు.. అంటూ సుధీర్‌ విషయాన్ని చెప్పిచెప్పకుండానే మాట్లాడింది. దీంతో ఆడిటోరియం ఒక్కసారిగా సుధీర్‌.సుధీర్‌.. అంటూ యూత్‌ కేకలు వేశారు.