ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 15 డిశెంబరు 2018 (13:02 IST)

సోనాక్షికి షాకిచ్చిన అమేజాన్‌.. హెడ్ ఫోన్సుకు బదులు ఇనుప బోల్ట్ పంపింది..

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే.. జనం జడుసుకుంటున్నారు. అలాగే ఈ-కామెర్స్ సైట్లు గతంలో ఒక వస్తువును ఆర్డరిస్తే దానికి బదులు వేరే వస్తువును పంపిన ఘటనలున్నాయి. ఇన్నాళ్లు సామాన్య ప్రజలకు ఇలాంటి ఘటనలు ఎదురయ్యాయి. తాజాగా బాలీవుడ్ సుందరి సోనాక్షి సిన్హాకు ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్ అమేజాన్ షాకిచ్చింది. 
 
హెడ్ ఫోన్సుకు బదులుగా ఇనుప బోల్టును పంపింది. దీంతో సోనాక్షి ముంబై అమేజాన్ ప్రతినిధితో మాట్లాడేందుకు ప్రయత్నించిందని.. అయితే వారి నుంచి స్పందన రాకపోవడంతో సోషల్ మీడియాలో బండారాన్ని బయటపెట్టింది. 
 
ఈ మేరకు అమేజాన్‌ను తప్పుబడుతూ సోనాక్షి.. ట్విట్టర్లో పోస్టు చేసింది. హెడ్ ఫోన్స్ కోసం అమేజాన్‌లో రూ.18వేలు చెల్లిస్తే.. అందులో ఇనుప బోల్ట్ వుందని చెప్పింది. ప్యాకింగ్ అంతా బాగానే వున్నప్పటికీ హెడ్ ఫోన్స్‌కు బదులుగానే ఇనుప బోల్టును పంపారని సోనాక్షి ఫైర్ అయ్యింది.
 
ఈ ట్వీట్‌కు అమేజాన్ కంపెనీని ట్యాగ్ చేసింది. దీంతో అమేజాన్ స్పందించింది. ఈ ఘటనకు విచారిస్తున్నామని తెలుపుతూ.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.