బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 21 అక్టోబరు 2018 (11:00 IST)

ఆ సీన్‌లో గట్టిగా హత్తుకుని అసభ్యంగా తడిమారు.. హీరో అర్జున్‌పై నటి ఆరోపణలు

హీరో అర్జున్ కూడా లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కన్నడ నటి శ్రుతి హరిహరన్ ఆరోపించారు. ఓ చిత్రం షూటింగ్ సమయంలో రొమాంటిక్ సీన్ చిత్రీకరణ సమయంలో హీరో అర్జున్ తనను గట్టిగా హత్తుకుని అసభ్యంగా తడిమారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది.
 
ప్రస్తుతం చిత్రపరిశ్రమను మీటూ ఉద్యమం కుదిపేస్తోంది. ఇందులోభాగంగా, చాలామంది హీరోయిన్లు తమకు ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేస్తున్నారు. ఈ కోవలో శ్రుతి హరిహరన్ తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించింది. కన్నడ, తమిళ ద్విభాషా చిత్రం 'నిబుణన్' సెట్స్‌లో (కన్నడలో ‘విస్మయ’) నటుడు అర్జున్‌ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. 
 
'నా లైఫ్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి చాలా చేదు అనుభవాలనే ఎదుర్కొన్నాను. ఎన్నో ఆశలతో నా సినిమా కెరీర్‌ను స్టార్ట్‌ చేశాను. నా కలలను నిజం చేసుకోవడానికి ఇండస్ట్రీ నాకు సహాయం చేసింది. కానీ ఇప్పుడు ఇలా చెప్పడానికి బాధగా ఉంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ సంకేతాలు నాకు కనిపించాయి. కొన్ని భయంకరమైన సంఘటల నుంచి తెలివిగా తప్పించుకోగలిగా. అయితే చిన్నప్పటి నుంచి అర్జున్‌ సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయన కారణంగా చేదు అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు. 2016లో అర్జున్‌తో వర్క్‌ చేసే చాన్స్‌ రాగానే ఎగై్జట్‌ అయ్యాను.
 
కానీ విస్మయ సినిమా సెట్‌లో ఓ రొమాంటిక్‌ సీన్‌ రిహార్సల్స్‌లో భాగంగా ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించారు. ఒక పాట సన్నివేశంలో అర్జున్‌ నన్ను గట్టిగా హత్తుకుని, అభ్యంతరకరంగా నన్ను తడిమారు. మీటూ ఉద్యమం ఇప్పుడు కాస్త పవర్‌ఫుల్‌గా తయారవుతోంది. అందుకే ఇప్పుడు పబ్లిక్‌గా చెబుతున్నాను' అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.