శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2024 (22:35 IST)

దేవిశ్రీ ప్రసాద్ బర్త్ డే సందర్భంగా తండేల్ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్

Nagachiatnya, chandu, devisriprasad, bunny vas
Nagachiatnya, chandu, devisriprasad, bunny vas
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "తండేల్". ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
 
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బర్త్ డే సందర్భంగా 'తండేల్' టీం ఆయనకు విషెస్ తెలియజేసింది. హీరో నాగ చైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి, నిర్మాత బన్నీవాసు, దేవిశ్రీని కలిసి బర్త్ డే విషెస్ అందించారు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
'తండేల్'లో మ్యూజిక్ ఒక మేజర్ హైలెట్ గా వుండబోతుంది. సినిమా కోసం చార్ట్ బస్టర్ అల్బమ్ కంపోజర్ చేశారు దేవిశ్రీ. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెన్సేషనల్ గా వుండబోతున్నాయి. తర్వలోనే మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేస్తారు.
 
'తండేల్' లో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తమ కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇందులో డి-గ్లామర్  అవతార్‌లలో కనిపిస్తారు.
 
మ్యాసీవ్ బడ్జెట్‌తో గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ఈ మూవీ ఇండస్ట్రీలో న్యూ టెక్నికల్ బెంచ్‌మార్క్‌లను సెట్ చేయనుంది. దర్శకుడు చందూ మొండేటి పాత్రల గెటప్‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, లోకల్ స్లాంగ్ అథెంటిక్ గా ఉండేలా చాలా కేర్  తీసుకుంటున్నారు.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌ కాగా, నేషనల్ అవార్డ్ విన్నర్  నవీన్ నూలి ఎడిటర్‌. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డిపార్ట్మెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం  విజువల్ గా మ్యూజికల్ గా ప్రేక్షకులు మెస్మరైజింగ్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ని అందించబోతోంది.