ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (21:46 IST)

ఫుడ్‌లో ఎంతో నాలెడ్జ్ వుంది. ర‌సంలేనిదే బ్రేక్‌ఫాస్ట్ పూర్తికాదుః త‌మ‌న్నా భాటియా

Tamanna-Allu sirish
ఇన్నోవేటివ్ ఫిలిమ్ అకాడ‌మీ వారి మాస్ట‌ర్ ఛెఫ్ తెలుగు ప్రీమియ‌ర్ త్వ‌ర‌లో జెమినీటీవీలో ప్ర‌సారం కాబోతుంది. హోస్ట్‌గా త‌మ‌న్నా భాటియా వ్య‌వ‌హ‌రించారు. బెంగుళూరులో ఇన్నోవేటివ్ ఫిలిమ్ సిటీలో వేసిన అద్భుత‌మైన సెట్లో దీనిని చిత్రీక‌రించారు. వ‌య‌స్సు తార‌త‌మ్యం లేకుండా మంచి వంట‌లు చేసే  ఉద్దండులు ఇందులో పార్టిసిపెంట్స్‌గా వున్నారు.

అల్లు శిరీష్‌కూడా వంట‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఆగ‌స్టు 27న శుక్ర‌వారం రాత్రి 8.30గంట‌ల‌కు జెమినీ టీవీలో ప్ర‌సారం కాబోతుంది. ఈ సంద‌ర్భంగా త‌మ అనుభ‌వాల‌ను తెలియ‌జేస్తూ మిస్ట‌ర్ చెప్ టీమ్ హైద‌రాబాద్ వచ్చింది. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌ను పంచుకున్నారు.
 
త‌మ‌న్నా మాట్లాడుతూ, మాస్ట‌ర్ చెఫ్ జ‌ర్నీ గురించి ఇన్నోవేటివ్ ఫిలిమ్ అకాడ‌మీ ప్ర‌సాద్‌గారు గొప్ప స్థాయిలో ఆలోచించారు. బేంగుళూరులో కిచెన్ ప్ర‌పంచం అద్భుతంగా సెట్ వేసి మురిపించారు. మొద‌టిసారిగా ప్రాంతీయంగా మిస్ట‌ర్ చెఫ్ చేస్తున్నాం. ఇండియాలోని క‌ల్చ‌ర్‌లో ఫుడ్‌కు మ‌రింత ప్రాధాన్య‌త వుంది. ఫుడ్ ఈజ్ ది సెల‌బ్రేష‌న్ ఆఫ్ లైఫ్‌.

అల్లు శిరీష్ మా షోకు వ‌చ్చాడు. బెస్ట్ ఎపిసోడ్ చేశారు. మాస్ట‌ర్ చెఫ్ షూట్‌లో ర‌క‌ర‌కాల ఫుడ్ రుచులు చూశాను. నాకు తెలుగు ఫుడ్ అంటే ఇష్టం. 15 ఏళ్ళ వ‌య‌స్సులో సినిమారంగానికి వ‌చ్చాను. నాకు బ్రేక్ ఫాస్ట్ ర‌సం లేకుండా పూర్తికాదు. తెలుగు ఫుడ్‌ను అంత‌ర్జాతీయంగా తీసుకెళ్ళాల‌నేదే ఈ మాస్ట‌ర్ చెఫ్‌ ఉద్దేశ్యం. నేను హోస్ట్‌గా వుండ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో మంది పార్టిసిపెంట్స్ చేసిన వంట‌కాల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. వారినుంచి కొత్త కొత్త విష‌యాలు నేర్చుకున్నాను. ఫుడ్‌లో ఎంతో నాలెడ్జ్ వుంది. జెమినీ టీవీలో ఈనెల 27న ప్ర‌సారం కాబోతుంది. అంద‌రూ ప్రోత్స‌హించండి` అని తెలిపారు.
 
Mr. Cheff team
మూడు విష‌యాలు గ్ర‌హించాను
అల్లు శిరీష్ స్పందిస్తూ, స‌హ‌జంగా వంట‌లు ఎలా వండుతారో తెలీదు. కానీ తింటాను. లేడీస్ క‌దా ఆ ప‌నిచేసేది అనుకునేవాడిని. కానీ మిస్ట‌ర్ చెఫ్ కు వెళ్ళాక నాకు వంట‌ల‌పై మ‌రింత ప్రేమ క‌లిగింది. ఏదైనా రుచిక‌రంగా వుందంటే తినేవాడిని. కానీ వంట‌ల ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి వారి క‌ష్టం, వారి ఆలోచ‌న‌, శ్ర‌మ నాకు థ్రిల్ క‌లిగించాయి. ఈ కార్య‌క్ర‌మంలో నేను వంట‌ల గురించి ఆలోచ‌న‌, ఆస్వాద‌న‌, అలంక‌ర‌ణ వంటి మూడు విష‌యాలు తెలుసుకున్నాను. ఫుడ్‌ను ఇష్టంగా తినేవారికి ఈ ప్రోగ్రామ్ అద్భుతంగా న‌చ్చుతుంది` అన్నారు. కాగా, సుప్ర‌సిద్ధ పాక‌శాస్త్ర నిపుణులు చ‌ల‌ప‌తిరావు, మ‌హేష్ ప‌డాల్‌, సంజ‌య్ తుమ్మ న్యాయ నిర్ణేత‌లుగా వుంటారు.