ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (11:07 IST)

జీవితంలో పెళ్లే వద్దనుకున్నా .. ఒకేసారి ముగ్గురితో కలిసి వుంటున్నానా?

pawankalyan
ఆహా ఓటీటీలో అత్యధిక వ్యూయర్ షిప్ వున్న అన్ స్టాపబుల్ 2 టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ షోకు నందమూరి హీరో బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  పవన్ పాల్గొన్న ఫస్టు పార్టును శుక్రవారం రాత్రి స్ట్రీమింగ్ చేశారు. 
 
"పవనేశ్వర .. పవరేశ్వరా" అంటూ పవన్‌ను బాలయ్య ప్రశంసించారు. ఆయన మేనరిజంను ప్రత్యక్షంగా చూడాలని ఉందంటూ పట్టుబట్టడం ఈ ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి. మెగా ఫ్యామిలీలో తన తల్లి.. వదిన .. చరణ్ .. సాయితేజ్ .. వైష్ణవ్ తేజ్ గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావించాడు. 'ఈ పెళ్లిళ్ల గోల ఏంటి భయ్యా?' అంటూ పవన్‌ను బాలయ్య అడిగారు. 
 
అందుకు పవన్ స్పందిస్తూ.. జీవితంలో తాను అసలు పెళ్లే చేసుకోకూడదని అనుకున్నానని.. బ్రహ్మచారిగానే వుండిపోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. కానీ అలా జరిగిపోయాయని చెప్పారు. రాజకీయాల్లో చాలామంది తనను ఈ పెళ్లిళ్ల విషయంలోనే టార్గెట్ చేస్తుంటారు. కానీ తానేమీ ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు. ఒకేసారి ముగ్గురితో కలిసి వుండటం లేదే అని చెప్తున్నా వినిపించుకోరని తెలిపారు.  
 
ఒకరితో కుదరన్నాక తాను విడాకులు ఇచ్చేసి చట్టబద్ధంగా మరోపెళ్లి చేసుకున్నానని పవన్ చెప్పారు. అంతే తప్ప వ్యామోహంతో చేసుకోవడం లేదు. తనను టార్గెట్ చేయడానికి మరో అంశం లేకపోతే అవతలవారు మాత్రం ఏం చేస్తారు పాపం .. అననీయండంటూ ఎద్దేవా చేశారు. 
 
ఈ విషయంపై ఘాటుగా స్పందించడానికి తనకు సంస్కారం .. సభ్యత అడ్డొస్తుంటాయి. అందువలన తన పనిని తను చేసుకుపోతుంటానని చెప్పారు. 'ఇకపై పవన్ పెళ్లిళ్ల గురించి ఎవరు మాట్లాడినా .. ' అంటూ బాలయ్య కాస్త ఘాటుగానే హెచ్చరించారు.