ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (11:04 IST)

విక్రాంత్‌ తీసిన స్పార్క్ L.I.F.E ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుంది: మినిష్ట‌ర్‌ జ‌గ‌దీష్‌రెడ్డి

Vikrant, Jagadish Reddy, Mehreen Pirzada, Ruksar Dhillon
Vikrant, Jagadish Reddy, Mehreen Pirzada, Ruksar Dhillon
విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్L.I.F.E’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. విక్రాంత్ హీరోగా న‌టిస్తూ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.   అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఈ సినిమా టీజ‌ర్‌ను బుధ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

అనంత‌శ్రీరామ్ మాట్లాడుతూ ``ఎక్కువ మంది నిర్మాత‌లు వ‌చ్చిన కార్య‌క్ర‌మం ఇది. నిర్మాత‌ల ప‌రిభాష‌లో ఈ సినిమాకు ఒక కొత్త హీరోకి పెట్టాల్సిన బ‌డ్జెట్ క‌న్నా ఎక్కువ పెట్టారు. కానీ, గొప్ప క‌థ‌కు పెట్టాల్సినంత బ‌డ్జెట్ పెట్టారు. పాట‌ రూపొంద‌డంలో జ‌ట్టుగా ప‌నిచేశాం. పాట‌లో వ‌చ్చే ప్ర‌తి మ‌లుపునూ ఆస్వాదించాం. పాట‌లు విడుద‌ల‌య్యాక అంద‌రూ ఆస్వాదిస్తార‌ని ఆశిస్తున్నాను`` అని అన్నారు.
 
మినిష్ట‌ర్‌ జ‌గ‌దీష్‌రెడ్డి మాట్లాడుతూ, సినిమాలో స్పార్క్ ఉంది. విక్రాంత్‌లో స్పార్క్ ఉంద‌నిపించింది. 10 - 15 ఏళ్లుగా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ట్రెండ్ మారింది. గ‌తంలో ఫైటింగ్ ఓరియంటెంట్ సినిమాలు చాలా ఉండేవి. టీజ‌ర్ ప్రారంభం చూడ‌గానే నాకు శివ గుర్తొచ్చింది. ఇప్ప‌టి త‌రానికి మ‌రో కొత్త ట్రెండ్‌ని ప‌రిచ‌యం చేస్తుంద‌ని భావిస్తున్నా. ఈ సినిమా త‌ప్ప‌కుండా ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుంది. విక్రాంత్‌లో ఉన్న స్పార్క్ ని కొత్త‌గా ఫిల్మ్ ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేస్తుంది. టీమ్ అంద‌రికీ శుభాకాంక్ష‌లు. విజ‌యం సాధించాలి`` అని అన్నారు.
 
న‌టుడు గురు సోమ‌సుంద‌రం మాట్లాడుతూ, నేను తెలుగు సినిమాలో న‌టించాన‌ని అనుకుంటుంటే ఈ క్ష‌ణం వ‌ర‌కు న‌మ్మ‌లేక‌పోతున్నాను. అమితాబ్ బ‌చ్చ‌న్ అంటే నాకు ఇష్టం. షారుఖ్‌ని నేను హార్డ్ కోర్ ఫ్యాన్‌. బాజీగ‌ర్ చూసిన‌ప్పుడు నాకు హిందీ కూడా తెలియ‌దు. బాజీగ‌ర్‌లో షారుఖ్‌లా క‌ళ్ల‌జోడు పెట్టుకునేవాడిని`` అని అన్నారు. 
 
హీరోయిన్ రుక్సార్ మాట్లాడుతూ `` క‌థ వినగానే చాలా డిఫ‌రెంట్‌గా, స్పార్క్ గా అనిపించింది. యంగ్‌, ఫ్రెష్ మైండ్స్ క‌లిసి చేసిన సినిమా ఇది. డిఫ‌రెంట్‌గా, యూనిక్‌గా చేయాల‌నుకుని చేశాం. ప్ర‌తిభావంతులైన న‌టీన‌టులు ఈ సినిమాకు ప‌నిచేశారు. మెహ్రీన్‌, విక్రాంత్ అంద‌రూ సినిమాను నెక్స్ట్ రేంజ్‌లో నిల‌బెట్టారు. నా ఫ్యాన్స్ కి, మా అభిమానులు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు`` అని అన్నారు.
 
హీరోయిన్‌ మెహ్రీన్ పిర్జాదా మాట్లాడుతూ ``విక్రాంత్ చాలా బాగా క‌ష్ట‌ప‌డ్డారు. చాలా ఇష్ట‌ప‌డి చేశారు. విక్రాంత్‌ని క‌లిసిన క్ష‌ణం నుంచి ఇప్ప‌టిదాకా నేను మ‌ర్చిపోలేను. మా నిర్మాత మ‌రిన్ని సినిమాలు నిర్మించాల‌ని ఆకాంక్షిస్తున్నాను. స‌హ న‌టీన‌టులంద‌రూ చాలా బాగా న‌టించారు. విక్రాంత్‌కి ఇది స్టార్టింగ్ మాత్ర‌మే. చేయాల్సిన ప్ర‌యాణం ఇంకా చాలా ఉంది`` అని అన్నారు.
 
 సి.అశ్వినీద‌త్ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన వీడియోను నాకు చూపించారు. ప్ర‌తీ ఫ్రేమ్ అద్భుతంగా చేశారు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో స‌మ్‌థింగ్ అవుతార‌నిపించింది. సాఫ్ట్‌వేర్ రంగం నుంచి సినిమా రంగంపై ఉన్న ప్యాష‌న్‌తో వ‌చ్చారు. అందులోనూ హీరోగా న‌టిస్తూ డైరెక్ట్ చేయ‌టం గొప్ప విష‌యం`` అన్నారు. 
 
మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేషం అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ ``విక్రాంత్ మంచి వ్య‌క్తి. నేను ఈ సినిమాలో భాగం కావ‌టంపై చాలా సంతోషంగా ఉన్నాను. స్పార్క్ మ్యూజిక్ మంచి ట్రీట్ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను`` అన్నారు. 
 
హీరో, ద‌ర్శ‌కుడు విక్రాంత్ మాట్లాడుతూ, యు.ఎస్ వెళ్లి చ‌దువుకుని జాజ్ చేసిన‌ప్ప‌టికీ సినిమాపై ప్రేమ పెరిగిందే కానీ, త‌గ్గ‌లేదు. ఆ ప్రేమ‌తోనే రెండేళ్ల పాటు క‌ష్ట‌ప‌డి స్పార్క్ సినిమా క‌థ‌ను డెవ‌ల‌ప్ చేసుకున్నాను. ఈ జ‌ర్నీలో మా డెఫ్ ఫ్రాగ్ టీమ్ ఎంతో స‌పోర్ట్ చేసింది. సినిమా చేసే క్ర‌మంలో ఎన్నో అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. అందులో కొన్ని మంచివి, కొన్ని చెడ్డ‌వి కూడా ఉన్నాయి. కానీ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతోనే ప్ర‌యాణించాం. గురు సోమ‌సుంద‌రం పోషించిన పాత్ర చాలా ఏళ్ల పాటు గుర్తుండిపోతుంద‌ని నేను గ‌ట్టిగా నమ్ముతున్నాను. సుహాసినిగారు కీల‌క పాత్ర‌లో నటించారు. నాజ‌ర్‌, శ్రీకాంత్ అయ్యంగారు, వెన్నెల కిషోర్‌, రాజా ర‌వీంద్ర‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, ఆషూ రెడ్డి.. ఇలా అంద‌రూ ఎంతో బాగా న‌టించారు. ఇక తెర వెనుక ఉండి న‌టీన‌టులు న‌డిపించారు. వారిలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేషం అబ్దుల్ వహాబ్ గురించి ముందుగా చెప్పుకోవాలి. ఆయ‌న తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో నెక్ట్స్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుతారు. హృద‌యం సినిమా చూడ‌గానే ఆయ‌నే నా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అని ఫిక్స్ అయిపోయాను. స్పార్క్ కోసం అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఆయ‌న సంగీతానికి అనంత శ్రీరామ్‌గారు అద్భుత‌మైన లిరిక్స్ అందించారు`` అన్నారు.