శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 6 జులై 2020 (14:33 IST)

దిల్ రాజు చాలా స్మార్ట్ గురూ... చూసి నేర్చుకోవాల్సిందే

ఇటీవలే అతి తక్కువ మంది మధ్య వివాహం చేసుకున్నారు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు. లాక్డౌన్ సమయంలో దిల్ రాజు వైఘా రెడ్డిని వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి ఆయన చాలా తక్కువ సందర్భాల్లో బయటకు కనిపిస్తున్నారు. తన భార్యతో సమయాన్ని గడుపుతున్నట్లు కొన్ని పిక్స్ అప్పుడప్పుడూ బయటకు వస్తున్నాయి.
 
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఆయన జిమ్‌లో వ్యాయామం చేయడం, తన భార్యతో క్రమం తప్పకుండా బ్యాడ్మింటన్ ఆడటం చేస్తున్నారు. బ్యాడ్మింటన్ సెషన్ తర్వాత దిల్ రాజు తన భార్యతో వున్న ఓ ఫోటో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ ఫోటోలో దిల్ రాజు చాలా స్మార్టుగా, అందంగా వున్నారని నెటిజన్లు అంటున్నారు. అదీ సంగతి.