శుక్రవారం, 14 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (16:41 IST)

మిలిటరీ హోటల్‌ శాఖను ప్రారంభించిన విశ్వక్ సేన్, అల్లరి నరేశ్

Viswaksen launch hotel
Viswaksen launch hotel
సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురిలో 1980ల నాటి మిలిటరీ హోటల్‌ రెండవ శాఖను ఘనంగా ప్రారంభించారు. సినీ హీరో విశ్వక్ సేన్, అల్లరి నరేశ్, డైరెక్టర్ అనిల్ రావుపుడి, నిర్మత సహో, డైరెక్టర్ హను రావుపుడి, నటుడు శత్రు పలువురు ప్రముఖులు హాజరై హోటల్ విభాగాలను ప్రారంభిచారు. మొదటి 1980 మిలటరీ హోటల్ ఖాజాగూడ లొకేషన్‌లో గత మూడు సంవత్సరాలుగా విజయవంతంగా సేవలందిస్తున్నామని  మరియు నల్లగండ్లలో రాబోయే బ్రాంచిని ప్లాన్ చేస్తున్నాము. సైనిక్‌పురిలో, మా రెస్టారెంట్‌తో పాటు, 'శ్రీ బాంక్వెట్స్' అనే ప్రీమియం మరియు లగ్జరీ బాంకెట్ హాల్‌లను కూడా ప్రారంభిచారు.
 
Allari naresh at hotel
Allari naresh at hotel
తాము 1980ల నాటి సుగంధ ద్రవ్యాలు, వంటకాలను సంప్రదాయ దక్షిణ భారతీయ వంటకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తామని... అందుకే  ఈ రెస్టారెంట్‌ కు "1980ల మిలిటరీ హోటల్" అని పేరు పెట్టామని తెలిపారు. మా రెస్టారెంట్ క్లాసిక్ ఫేర్ యొక్క విభిన్న మెనూని అందిస్తుంది, స్థానికంగా లభించే పదార్థాలతో తయారు చేయబడుతుంది మరియు వెచ్చని మరియు ఆహ్వానించదగిన వాతావరణంలో అందించబడుతుందని  వారి తెలిపారు.