మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (17:21 IST)

ఎన్ టి.ఆర్. రాకతో జోష్ లో ఉన్న విశ్వక్ సేన్

NTR-Viswkasen
NTR-Viswkasen
ఆర్.ఆర్.ఆర్. సినిమా కు ఆస్కార్ రావడంతో ఎన్ టి.ఆర్. ఎంత జోష్ లో ఉన్నాడో అంత కంటే ఆనందంలో విశ్వక్ సేన్ ఉన్నాడు. ‘దాస్ కా ధమ్కీ’ విశ్వక్ సేన్ 2.0.  ప్రీ రిలీజ్ శిల్పకలా వేదికలో ఈరోజే జరగనుంది. దీనికి ఎన్ టి.ఆర్. గెస్ట్. కానీ.  ఆస్కార్ సందడిలో వస్తాడో రాడో అనే అనుమానమ్ ఉండేది. అది ఈరోజు తీరిపోయింది. ఎన్ టి.ఆర్. హైదరాబాద్ చేరుకోగానే విశ్వక్ సేన్ పలకరించి శుభాకాంక్షలు చెప్పారు. తప్పకుండ ఫంక్షన్ కు వస్తున్న ట్లు ఎన్ టి.ఆర్. చెప్పారు. 
 
ఇప్పుడు శిల్పకలా వేదికలో సందడిగాఉంది. పోలీస్ లు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మరి ఫంక్షన్లో ఎన్ టి.ఆర్. స్పీచ్ హైలెట్ కానుంది. ఆస్కార్ విషయాలు కూడా చెప్పనున్నట్లు తెలిసింది. ఈ ఘనత విశ్వక్ సేన్ కు దక్కుతుంది.  డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధంగా ఉంది.