ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (19:40 IST)

కోలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు? అల్లు అర్జున్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి?

కె.సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం "పుష్ప". ఈ చిత్రం ఈ నెల 17వ తేదీన విడుదలకానుంది. అయితే, మంగళవారం ఈ చిత్రం తమిళ ట్రైలర్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఇందులో హీరో అల్లు అర్జున్‌, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు అల్లు అర్జున్ ఓపిగ్గా సమాధానమిచ్చారు. తమిళంలో మీకు నచ్చిన డ్యాన్సర్ ఎవరు అనే ప్రశ్నకు బన్నీ సమాధానమిస్తూ, మునుపటి తరంలో కమల్ హాసన్ అయితే ఇపుడు విజయ్, ధనుష్, శింబు, శివకార్తికేయన్ అంటూ సమాధానమిచ్చారు. 
 
కాగా, తనకు కోలీవుడ్‌లో కూడా మంచి నటుడిగా గుర్తింపు పొందాలని ఉందన్నారు. తన సినిమాలు తమిళంలోనూ మంచి విజయాన్ని అందుకుంటున్నాయని చెప్పారు. 'పుష్ప' చిత్రంలో తన ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పారు. ీ సనిమా పాటలు తమిళనాడు ప్రజలను కూడా బాగా ఆకట్టుకుంటున్నాయని చెప్పారు.