మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. సాహిత్యం
  3. కళలు మరియు సంస్కృతి
Written By
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (13:08 IST)

15న గురజాడ ''దేశభక్తి'' గేయంపై ఆలాపన పోటీలు

15న గురజాడ ''దేశభక్తి'' గేయంపై ఆలాపన పోటీలు జరుగనున్నాయి. ఈ నెల 21వ తేదీన నవయుగ వైతాళికుడు శ్రీ గురజాడ వెంకట అప్పారావు గారి 157వ జయంతిని పురస్కరించుకుని పాఠశాల స్థాయి విద్యార్థులకు గురజాడ ''దేశభక్తి'' గేయంపై ఆలాపన పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు డా.నూనె అంకమ్మరావు, కుర్రా ప్రసాద్ బాబులు ఒక ప్రకటనలో తెలిపారు. 
 
ఈ పోటీలు 15వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతాయని వెల్లడించారు. ప్రతి పాఠశాల నుంచి రెండు టీమ్‌లను పంపించవచ్చునని, ఒక్కో టీమ్‌కు ఐదుగురు విద్యార్థులు వుండవచ్చునని పేర్కొన్నారు. విజేతలకు బహుమతులను 21వ తేదీ సాయంత్రం జిల్లా గ్రంథాలయంలో జరిగే సభలో అందజేస్తామని తెలియజేశారు.