శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 2 జులై 2019 (18:00 IST)

మా ఆవిడ కరాటెలో బ్లాక్ బెల్ట్... రన్నింగ్‌లో నాకు గోల్డ్ మెడల్...

టీచర్- పార్వతీదేవి శివుడిని భర్తగా ఎందుకు ఎంచుకుందో నాలుగు కారణాలు రాయండి అని చెప్పాడు టీచర్.
 
స్టూడెంట్- ఒక విద్యార్ది ఇలా రాశాడు... శివుడు జింక చర్మం ధరిస్తాడు. కాబట్టి పార్వతిదేవికి బట్టలు ఉతికే  పని ఉండదు. తలపై గంగ ఉంటుంది కాబట్టి బిందె పట్టుకుని నీళ్లకు బయటకు వెళ్లనక్కర్లేదు. చంద్రవంక ఉంటుంది కాబట్టి కరెంటు ప్రాబ్లమ్ లేదు. కందమూలాలు తింటాడు కాబట్టి వంట వండే అవసరం ఉండదు... ఈ కారణముల చేత పార్వతీదేవి శివుడుని వివాహం చేసుకున్నాడు.
 
2.
రామారావు- ఏంట్రా సుబ్బారావు... మీ ఆవిడ కరాటేలో బ్లాక్‌బెల్ట్ అంట కదా.... మీ ఇద్దరి మధ్య గొడవ వస్తే నీకేం ప్రాబ్లమ్ లేదా.... అని అడిగాడు.
 
సుబ్బారావు- నువ్వన్నది నిజమే... కానీ నేను రన్నింగ్‌లో గోల్డ్ మెడల్ గ్రహీతననే సంగతి మరిచావా..... అని గుర్తుచేశాడు సుబ్బారావు.