1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 16 మే 2024 (17:24 IST)

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

leopard hunting a porcupine
ముళ్లపందిని వేటాడి ఆరగించాలని చిరుతపులి చాలా కష్టపడింది. రోడ్డు పైన కనిపించిన ముళ్లపందిని భోజనం చేయాలనుకుని దాన్ని చంపేందుకు ప్రయత్నించింది. ఐతే ముళ్లపంది తన శరీరంపై వున్న ముళ్లతో చిరుతపులిని నానా తంటాలు పెట్టింది. కానీ ఎంతకీ పట్టువదలని చిరుత రోడ్డుపై జారుతూ, తలను నేలకు ఆనించి కింద నుంచి కరిచి తినేయాలని ప్రయత్నం చేసింది.
 
దీనితో మరీ ఆగ్రహం చెందిన ముళ్లపంది తన శరీరంపై వున్న ఓ ముల్లును చిరుత నోటికి గుచ్చేసింది. అంతే... విలవిల్లాడుతూ చిరుత ఆ పందిని వేటాడటం వదిలేసి ముల్లును తొలగించుకునేందుకు తన కాలితో నోటిపై పెట్టుకుని గట్టిగా రుద్దుకోసాగింది. అప్పటికే చిరుత మూతి వద్ద గాయమై రక్తస్రావం కూడా అయ్యింది. అందుకే దాదాపు అడవి జంతువుల్లో ఎక్కువగా ముళ్లపంది జోలికి వెళ్లవు.