ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (22:02 IST)

ఫోటోగ్రాఫర్‌పై చేజేసుకున్న వరుడు.. పగలబడి నవ్విన వధువు (Video)

Bride
వధువును పలు రకాలుగా స్టిల్స్‌ తీసిన ఫోటోగ్రాఫర్‌పై వరుడు చేజేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వధూవరులు నిలిచివున్న వేదికపై వరుడుని పక్కనబెట్టి.. వధువును ఫోజులివ్వమని తెగ ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్‌పై వరుడు మండిపడ్డాడు. అంతేగాకుండా ఫోటోగ్రాఫర్‌పై మండిపడ్డాడు. అంతేగాకుండా అతనిపై చేజేసుకున్నాడు. 
 
సాధారణంగా పెళ్ళిళ్లలో వధువు అలంకరణ హైలైట్‌గా వుంటుంది. దుస్తులు, ఆభరణాలు, హెయిర్ స్టైల్ అదిరిపోతుంది. అలా పెళ్లికి వచ్చిన వారంతా వధువు అందం, అలంకరణ గురించి మాట్లాడుకుంటారు. అలా వివాహ వేడుకకు వచ్చిన ఫోటోగ్రాఫర్.. వెడ్డింగ్ ఆల్బమ్ కోసం వధువును పలు ఫోజుల్లో ఫోటోలు తీశాడు. 
 
దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చింది. అంతే ఫోటోగ్రాఫర్‌పై మండిపడ్డాడు. అతనిపై దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఫోటోగ్రాఫర్‌పై చేజేసుకున్న వెంటనే వధువు పగలబడి నవ్వింది. నవ్వాపుకోలేక కిందపడి నవ్వింది. ఫోటోగ్రాఫర్ కూడా నవ్వేశాడు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.