శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (21:46 IST)

కాశ్మీర్‌లో ఆంక్షల సడలింపు: తిరిగి ప్రారంభమైన పాఠశాలలు

ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత ఆంక్షలు, సైనికుల తుపాకీ నీడన గడిపిన జమ్మూకాశ్మీర్‌లో తిరిగి సాధారణ పరిస్ధితులు నెలకొల్పేందుకుగాను సోమవారం నుంచి ఆంక్షలు సడలించారు. 
 
35 పోలీస్ స్టేషన్ల పరిధిలో 6 నుంచి 8 గంటల పాటు ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ సమయంలో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ల్యాండ్ ఫోన్లు, ఇంటర్‌నెట్ సేవలపైనా నిషేధాన్ని ఎత్తివేసే అవకాశాలున్నాయి. 
 
మరోవైపు పాఠశాలు సైతం తిరిగి ప్రారంభిస్తున్నట్లు జమ్మూకాశ్మీర్ ప్రణాళిక, అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిత్ కన్సాల్ తెలిపారు. సోమవారం నుంచి కాశ్మీర్‌లో ప్రభుత్వ కార్యాలయాలు యధావిథిగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.