మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 18 జులై 2018 (15:41 IST)

15 యేళ్ళ తర్వాత అవిశ్వాసం.. సంఖ్యాబలం లేదని ఎవరన్నారు?

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కోనుండటం దశాబ్దన్నర కాలం తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. కేంద్రంలో

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కోనుండటం దశాబ్దన్నర కాలం తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
బుధవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల ప్రారంభం తర్వాత టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మాన నోటీసును ఇచ్చారు. దీన్ని స్వీకర్ సుమిత్రా మహాజన్ స్వీకరించారు. అవిశ్వాసంపై చర్చా, సమయాలను పది రోజుల్లో ఖరారు చేస్తానని తెలిపారు. 
 
కాగా, సుమారు 15 యేళ్ళ తర్వాత లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం రానుంది. చివరిసారిగా 2003లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అది 314-189 ఓట్ల తేడాతో వీగిపోయింది. 
 
మళ్లీ 15 ఏళ్ల తర్వాత మరోసారి నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ భుత్వంపైనే ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హామీలు అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. శుక్రవారం ఈ అవిశ్వాసంపై చర్చ చేపట్టనున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన తెలిపారు. 
 
ఇకపోతే, విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ ఆమోదించడంపై కాంగ్రెస్‌ హర్షం వ్యక్తం చేసింది. బుధవారం టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. మా వద్ద తగిన సంఖ్యాబలం లేదని ఎవరన్నారని ప్రశ్నించినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం జవాబుదారీగా ఉండేలా చేయడానికి ఉపయోగపడుతుందని కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది. కీలక అంశాలపై ప్రభుత్వం మౌనం వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.