బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2023 (12:33 IST)

రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటు బాంబు పేలింది..

bomb
bomb
ఇంగ్లండ్‌లోని నార్ ఫోల్క్ కౌంటీలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటు బాంబు పేలింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబును గుర్తించి డిప్యూజ్ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించారు. 
 
నార్ ఫోల్క్ కౌంటీలోని గ్రేట్ యార్మౌత్ టౌన్‌లో పాతకాలం నాటి పేలని బాంబును అధికారులు గుర్తించారు. ఇలా గుర్తించిన బాంబులు డిప్యూజ్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తారు. డిప్యూజ్ చేయడం కుదరని సందర్భంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని బాంబును పేల్చేస్తారు. 
 
ఇదేవిధంగా మంగళవారం గుర్తించిన బాంబును డిప్యూజ్ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బాంబును గుర్తించిన చోట చుట్టుపక్కల ప్రదేశాల్లోని జనాలను అక్కడి నుంచి తరలించారు.
 
ట్రాఫిక్‌ను దారి మళ్లించి, రోబోలతో బాంబును డిప్యూజ్ చేయడానికి ఉపక్రమించారు. ఈ ప్రయత్నంలో బాంబు పేలిపోవడంతో భారీ విస్పోటనం జరిగిందని పోలీసులు తెలిపారు.