శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (18:16 IST)

చెదిరిపోయిన ఆలయాలను పూర్తిగా తొలగించి కట్టొచ్చా..?

కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు చెదిరిపోయి ఉంటాయి. వాటి గురించి ఎవ్వరు అంతగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా చెదిరిపోయిన ఆలయాలను పూర్తిగా తొలగించి కట్టొచ్చా.. లేదా స్థలం మార్చాలా అని చింతిస్తుంటారు. అలాంటివారికోసం..
 
శిథిలమైన ఆలయాలు పునర్నిర్మాణం చేయడం అనివార్యం. వాటిని కాపాడుకోవడం అంటే మన జాతి సంపదను కాపాడుకోవడం. ఒక్కో ఆలయానికి ఒక్కో విధంగా కట్టడం ఉంటుంది. ఆగమాన్ని బట్టి ఆయా గర్భగుడుల వైశాల్యం విగ్రహ ప్రతిష్ఠాప స్థానాలు మారుతుంటాయి.
 
ఆలయం పూర్తిగా జార్గమయి ఉంటే తప్పక తొలగించి కట్టాలి. స్థలం మార్చాల్సిన అవసరం లేదు. ఆ స్థానంలోనే కట్టుకోవచ్చు.. లేదా స్థలం కూడా మార్చవచ్చు. తప్పనిసరికాదు. కొన్ని ఆలయాలు స్వయంభువులుగా ఉంటాయి. ఆలంటి ఆలయ నిర్మాణాన్ని తిరిగి గొప్పగా పునరుద్ధరించవచ్చు. మనం యాదగిరి గుట్టను అలానే బృహత్తంగా చేసుకుంటున్నాం. మీరు ఆలయ నిర్మాణ నిపుణుల సూచనలు, సలహాల మేరకు అన్నీ తెలుసుకుని జాగ్రత్తగా నిర్మాణం చేసుకోవాలి.